చెరువులను తలపిస్తున్న రోడ్లు.. స్థంభించిన రవాణా..

దేశ ఆర్థిక రాజధాని భారీ వర్షాలతో తడిసిముద్దైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు.. ఇవాళ ముంబై, థానే, కొంకణ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఇవాళ కూడా ముంబై పరిసర ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అధికారులు ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా నగరాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ మంత్రి […]

చెరువులను తలపిస్తున్న రోడ్లు.. స్థంభించిన రవాణా..
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2019 | 9:27 AM

దేశ ఆర్థిక రాజధాని భారీ వర్షాలతో తడిసిముద్దైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు.. ఇవాళ ముంబై, థానే, కొంకణ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఇవాళ కూడా ముంబై పరిసర ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అధికారులు ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా నగరాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. భారీ వర్షాల ధాటికి రోడ్లన్నీ జలమయ్యాయి. పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సియాన్, వడాల రోడ్డు రైల్వేస్టేషనుతోపాటు ముంబైలోని పలు లోతట్టుప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచిపోయింది. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరదల వల్ల సాధారణ జన జీవనానికి అంతరాయం ఏర్పడింది.

ఇక భారీ వర్షాలు కురుస్తుండటంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ముంబైలో 20 విమాన సర్వీసులను రద్దు చేశారు. భారీవర్షాల వల్ల వాతావరణం అనుకూలించక పోవడంతో 280 విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రోజుకు వెయ్యి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే భారీవర్షాల వల్ల విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. బుధవారం 44 శాతం విమానాలు ఆలస్యంగా వచ్చాయని.. వాతావరణం అనుకూలించక పోవడంతో పలు విమానాలు 25 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయని తెలిపారు.

'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..