Fruit Boxes: పైకి చూస్తే ఫ్రూట్ బాక్సులు.. తీరా ఓపెన్ చేసి చూస్తే పోలీసుల కళ్లు బైర్లు..

అయితే పోలీసులు ఏమైనా తక్కువా.. వారి ఆటను కట్టించి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాజాగా మహారాష్ట్రలో..

Fruit Boxes: పైకి చూస్తే ఫ్రూట్ బాక్సులు.. తీరా ఓపెన్ చేసి చూస్తే పోలీసుల కళ్లు బైర్లు..
Fruit Boxes Load

Updated on: Oct 03, 2022 | 8:54 PM

మహారాష్ట్రలో డ్రగ్స్ దండా యదేచ్చగా సాగుతోంది. వీటిని అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నప్పటికీ.. కేటుగాళ్లు క్రియేటివిటీని ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను ఇతర రాష్ట్రాలకు సీక్రెట్‌గా తరలిస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువా.. వారి ఆటను కట్టించి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఇంటిలిజెన్స్ అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా ఓ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. వారు 198 కిలోల క్రిస్టల్ మెథాంఫేటమిన్, 9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1,467 కోట్లు ఉంటుందని అంచనా.

వివరాల్లోకి వెళ్తే.. పక్కా సమాచారం ప్రకారం.. ఇంటిలిజెన్స్ అధికారులు, పోలీసులకు నేవీ ముంబైలో గత నెల ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే వారు సెప్టెంబర్ 12వ తేదీన ఓ పండ్ల ట్రక్‌ను చెక్ చేస్తుండగా.. ఫ్రూట్ డబ్బాలపై అనుమానం వచ్చింది. వాటిని సరిగ్గా చెక్ చేయడంతో పెద్ద ఎత్తున డ్రగ్స్ లభ్యమయ్యాయి. పండ్ల డబ్బాలో ఎవ్వరూ కనిపెట్టని విధంగా కేటుగాళ్లు డ్రగ్స్‌ను దాచిపెట్టగా.. అధికారులు తెలివిగా పట్టుకున్నారు. కాగా, ఈ మాదకద్రవ్యాలు దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చాయని.. దిగుమతి చేసిన వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేశామని.. ఈ డ్రగ్స్ అక్రమంగా రవాణా చేసిన సూత్రధారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపారు.

కాగా, ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఓ విదేశీ ప్రయాణీకుడి నుంచి సుమారు 5 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 34 కోట్లు ఉంటుందని అంచనా.

మరిన్ని జాతీయ వార్తల కోసం..