పాపం పసిప్రాణం.. చిన్నారి బ్రతకాలంటే 16 కోట్లు కావాలి.. ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం..
తమ కన్నకూతురిని బ్రతికించుకోవడానికి ఆ తల్లిదండ్రుల పడుతున్న వేదన వర్ణనాతీతం. ముంబై పట్టణంలోని అంధేరీ ప్రాంతానికి చెందిన మిహర్ కామత్, ప్రియంక్ కామత్లకు ఒక కూతురు ఉంది పేరు 'తీరా'.
తమ కన్నకూతురిని బ్రతికించుకోవడానికి ఆ తల్లిదండ్రుల పడుతున్న వేదన వర్ణనాతీతం. ముంబై పట్టణంలోని అంధేరీ ప్రాంతానికి చెందిన మిహర్ కామత్, ప్రియంక్ కామత్లకు ఒక కూతురు ఉంది పేరు ‘తీరా’. ఆ పాప వారికి మొదటి సంతానం కావడంతో వారి ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. సంతోషంగా ఉన్న వారి జీవితాలలో ఓ వార్త చీకట్లను తెచ్చింది. వారి పాపకు ‘స్పైనల్ మస్య్కులర్ అట్రోఫీ’ అనే జన్యుపరమైన లోపం ఉన్నట్లుగా తెలిసింది. పాప బ్రతకాలంటే జీనీ థెరపీ చేయాలని డాక్టర్లు సూచించారు. కానీ ఆ చికిత్సకు భారీ మొత్తంలో రూ.16 కోట్లు డబ్బు అవసరం పడుతుందని తెలిపారు.
పాప బ్రతకడానికి ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉందని.. ఆలోపు డబ్బు సమకూర్చాలని డాక్టర్లు తెలిపారు. దీంతో అంత డబ్బును ఎలా తీసుకురావాలో ఆ కుటుంబానికి పెద్ద పరీక్షగా మారింది. ” పాప చికిత్స కోసం విరాళాలు సేకరిస్తున్నాం. ఆన్లైన్లో ఇప్పటివరకు రూ.2.36 కోట్లు సేకరించాము. దాదాపు 8,187 మంది మాకు సహాయం చేశారు. మా పాపకు వైద్యం చేస్తున్న డాక్టర్ నీలు దేశాయ్ ‘స్విట్జర్లాండ్ హెచ్క్యూ నోవార్టిస్ ఫార్మా కంపెనీ’ గ్లోబల్ లాటరీలో పాప పేరును రిజిస్ట్రర్ చేశారు. ఆ కంపెనీ లాటరీ తగిలిన వారికి మందు ఫ్రీగా ఇస్తుంది” అని పాప తండ్రి తెలిపారు.