మధ్యప్రదేశ్‌లో 38 ఏళ్ల మహిళకు నిప్పు అంటించారు కొందరు వ్యక్తులు. భూ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదంతో బాధిత మహిళపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన గుణ జిల్లాకు చెందినదిగా తెలిసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని రాంప్యారి సహారియాగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రభుత్వం బాధిత మహిళకు ఇచ్చిన భూమిని కొందరు ఆక్రమించే ప్రయత్నం చేశారు. వివాదాస్పద భూమి వద్దే ఆ మహిళకు నిప్పు అంటించి ముగ్గురు వ్యక్తులు వీడియో తీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో షేర్ అవుతోంది. గుణ జిల్లాలోని రామ్‌ప్యారీ షహరియాలో ఈ ఘటన జరిగింది. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కాలిన గాయాలతో రోదిస్తున్న భార్యను తన భూమిలో చూసినట్లు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నించిన వాళ్లు ఓబీసీ వర్గానికి చెందినట్లు భర్త తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
India
PM @narendramodi‘s #NewIndiaHeart breaking incident in MP state, Guna dist.
Few BJP party workers occupying the land of a Dalit woman & tried her to burn alive.@NYTimesPR @guardian@Reuters @SkyNews @cnni @VICENews @MSNBC @TIME @CBCNews @Slate @Channel4News @USAToday pic.twitter.com/OtAJqFhnhW
— Dravidian (@Gasi_Nat) July 3, 2022
కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి