Viral: తాళం వేసిన ఇంటి నుంచి దుర్వాసన.. ఏంటని చూసేందుకు తలుపులు బద్దలు కొట్టగా..

|

May 31, 2022 | 9:40 PM

ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టగా.. షాకింగ్ సీన్ వాళ్ల కంట పడింది. అది చూసిన స్థానికులు దెబ్బకు పోలీసులకు సమాచారం అందించారు..

Viral: తాళం వేసిన ఇంటి నుంచి దుర్వాసన.. ఏంటని చూసేందుకు తలుపులు బద్దలు కొట్టగా..
Representative Image
Image Credit source: Representative Image
Follow us on

ఆ ఇంటి నుంచి ముక్కుపుటాలు అదిరేలా దుర్వాసన బయటకొస్తోంది. దాన్ని గమనించిన చుట్టుప్రక్కల వారు.. ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టగా.. షాకింగ్ సీన్ వాళ్ల కంట పడింది. అది చూసిన స్థానికులు దెబ్బకు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యాలో చోటు చేసుకుంది. అసలు అదేంటో.? స్థానికులు ఏం చూసి భయపడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళ్తే.. స్థానిక హళ్లాహళ్లి లేక్​ ప్రాంతం న్యూ తమిళ్​ కాలనీలోని ఓ ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. చుట్టప్రక్కల వాళ్లు ముందుగా ఎలుక ఏదైనా చనిపోయి ఉండొచ్చునేమోనని అనుకున్నారు. దానికోసం వెతకారు. అప్పుడే వాళ్లకు పక్కింటిలో ఉండే నాగమ్మ, రూప అనే తల్లికూతుళ్లు ఇద్దరూ కొద్దిరోజులుగా కనిపించట్లేదని గుర్తిస్తారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి.. నాగమ్మ ఇంటి తలుపులను బద్దలు కొడతాడు. ఇక వారి ఫ్యూజులు ఎగిరిపోయేలా.. అక్కడ షాకింగ్ దృశ్యాలు కనిపిస్తాయి. నాగమ్మ.. ఆమె కూతురు రూప మృతదేహంతో ఉండటం చూసి స్థానికులు దడుసుకుంటారు. కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని చూసిన జనాలు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. స్థానికుల సాయంతో కుళ్లిన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు పోలీసులు.

కాగా, నాగమ్మ, రూపలు కొన్ని సంవత్సరాల నుంచి న్యూ తమిళ్ కాలనీలో నివాసముంటున్నారని పోలీసులు తెలిపారు. రూప హోంగార్డ్‌గా విధులు నిర్వర్తించేదని.. అయితే ఓ కారణం వల్ల ఆమె కొద్దినెలల క్రితం ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిందన్నారు. అలాగే రూపకు పదేళ్ల కిందట పెళ్లయిందని.. కుటుంబ సమస్యల కారణంగా ఆమె భర్తకు, పిల్లలకు దూరంగా ఉంటోందని పోలీసులు చెప్పారు. అప్పటి నుంచి తల్లితోనే రూప నివసిస్తోందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల కిందట ఆర్ధిక సమస్యలు కారణంగా తల్లికూతుళ్లు ఇద్దరూ మద్యానికి బానిసయ్యారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. తరచూ ఏదొక కారణం వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని..నాలుగు రోజుల నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారని స్థానికులు.. పోలీసులకు తెలిపారు. రూప ఎలా చనిపోయిందోనన్న విషయం.. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తెలుస్తోందని పోలీసులు స్పష్టం చేశారు.