కార్గిల్ యుద్ధంలో మరణించినవారికన్నా ఈ పాండమిక్ కాలంలో మృతుల సంఖ్య ఎక్కువే, , మాజీ ఆర్మీ చీఫ్
లోగడ కార్గిల్ యుధ్దంలో మరణించినవారికన్నా ఈ కరోనా పాండమిక్ తరుణంలో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువేనని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వేద్ ప్రకాష్ మాలిక్ ఆందోళన వ్యక్తం చేశారు.
లోగడ కార్గిల్ యుధ్దంలో మరణించినవారికన్నా ఈ కరోనా పాండమిక్ తరుణంలో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువేనని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వేద్ ప్రకాష్ మాలిక్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నికల ర్యాలీలు, రైతుల నిరసనలు కూడా ఈ కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కార్గిల్ వార్ రెండు నెలలపాటు కొనసాగిందని, ఆ వార్ లో మృతి చెందిన వారికన్నా ఈ కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య రెండున్నర రెట్లు ఎక్కువగా ఉందని మాలిక్ అన్నారు. నిన్న ఒక్క రోజే 1300 మందికి పైగా రోగులు మరణించారని ఆయన పేర్కొన్నారు. ఈ వార్ మీద దేశం ఫోకస్ పెట్టిందా అని అని ఆయన ప్రశ్నించారు. కార్గిల్ యుధ్ద సమయంలో ఈయన ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. బెంగాల్ లో ఎన్నికల ర్యాలీలు, ఢిల్లీలో రైతుల నిరసనలు ఇలాంటివి కరోనా కేసులు పెరగడానికి దోహద పడ్డాయని, ఈ పరిస్థితిని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ను తాను ఊహించలేదని మాలిక్ పేర్కొన్నారు. ఇండియా…. మేల్కో అని ఆయన ట్వీట్ చేశారు. కరోనా పరిస్థితిపై ఓ మాజీ సైనికాధికారి స్పందించడం ఇదే మొదటిసారి.
మరిన్ని ఇక్కడ చూడండి: బీహార్ లో మే 15 వరకు నైట్ కర్ఫ్యూ, సినిమా హాళ్లు, జిమ్ సెంటర్లు, మాల్స్, స్కూల్స్, కాలేజీలు బంద్