PM Modi: ‘ది కేరళ స్టోరీ’ సినిమా గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే.

కర్ణాటక ఎన్నికల వేళ పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండడంతో ప్రచారంలో జోరు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్న నేపథ్యంలో ప్రచారం పీక్స్‌కి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వివాదాస్పదంగా మారిన..

PM Modi: ది కేరళ స్టోరీ సినిమా గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే.
Pm Modi

Updated on: May 05, 2023 | 5:15 PM

కర్ణాటక ఎన్నికల వేళ పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండడంతో ప్రచారంలో జోరు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్న నేపథ్యంలో ప్రచారం పీక్స్‌కి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వివాదాస్పదంగా మారిన ది కేరళ స్టోరీ సినిమా గురించి ప్రధాని స్పందించారు. బళ్లారిలో జరిగిన ఎన్నికల సభలో శుక్రవారం మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన ది కేరళ స్టోరీ సినిమా గురించి ప్రధాని మోదీ కర్నాటకలోని బళ్లారి ఎన్నికల సభలో ప్రస్తావించారు. ఆ సినిమాను నిషేధించాలని కాంగ్రెస్‌ చేస్తున్న హడావుడిపై ప్రధాని విస్మయం వ్యక్తం చేశారు. కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. తన ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు ఉగ్రవాదం ముందు మోకరిల్లిందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయమై ప్రధాని మాట్లాడుతూ.. ‘సినిమాను నిజ సంఘటనల ఆధారంగానే తీశామని దర్శక నిర్మాతలు చెప్తున్నా.. కాంగ్రెస్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఉగ్రవాదుల తరపున నిలబడుతోంది. సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఉగ్రవాదులు కేరళ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా నాశనం చేస్తున్నారో ఆ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇదే కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టింది. ఎందుకంటే ఆ పార్టీ ఎప్పుడూ ఉగ్రవాదులకే సపోర్ట్ చేస్తుంది. సమాజాన్ని నాశనం చేస్తుంది. టెర్రరిజంతో లింక్‌లు ఉన్న వారితో చేతులు కలుపుతోంది. వాళ్లతో రాజకీయ లావాదేవేలు జరుపుతోంది’ అంటూ విరుచుకుపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..