Raj Thackeray: తమ అభిమాననేత పుట్టిన వేడుకలను భిన్నంగా చేసిన నాయకులు.. లీటర్ పెట్రోల్ రూ.54 లకు అందజేత..

|

Jun 15, 2022 | 6:24 AM

ఇప్పుడు బర్త్ డే సెలబ్రేషన్స్ విషయంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. తాము అభిమానించేవారి పుట్టిన రోజుకి స్పెషల్ సెలబ్రేషన్స్ అంటూ.. వినూత్నంగా పెట్రోల్ ను తగ్గింపు ధరల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే.

Raj Thackeray: తమ అభిమాననేత పుట్టిన వేడుకలను భిన్నంగా చేసిన నాయకులు.. లీటర్ పెట్రోల్ రూ.54 లకు అందజేత..
Raj Thackeray
Follow us on

Raj Thackeray: తాము అభిమానించే నేత, నటీనటులు పుట్టిన రోజుకి సామజిక కార్యక్రమాలు చేపట్టడం, అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. తాము అభిమానించేవారు పుట్టిన రోజుకి స్పెషల్ సెలబ్రేషన్స్ అంటూ.. వినూత్నంగా పెట్రోల్ ను తగ్గింపు ధరల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో నవనిర్మాణ్ సేన పార్టీ రాజ్ ఠాక్రే పుట్టిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు తక్కువ ధరకు పెట్రోల్ అందించారు. వివరాల్లోకి వెళ్తే..

రాజ్ ఠాక్రే 54వ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకుని నగరంలోని క్రాంతి చౌక్ పెట్రోల్ పంపులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన లీటరుకు రూ.54 చొప్పున పెట్రోల్ పంపిణీ చేసింది. MNS వైస్ ప్రెసిడెంట్లు మౌలి థోర్వ్ , సవితా థోర్వ్  ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 14వ తేదీ ఉదయం 5:30 గంటలకు షెగావ్‌లోని సంత్ గజానన్ మహారాజ్ ఆలయం వద్ద MNS కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వందలాది మంది కార్యకర్తలు గజానన్ మహారాజ్ హారతి నిర్వహించి, రాజ్ ఠాక్రే ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు.

పెట్రోల్ సగం ధరకే అన్న తెలుసుకున్న స్థానికులు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే పెట్రోల్ బంక్​ వద్ద గుమిగూడారు. ఇదే విషయంపై ఔరంగాబాద్ MNS జిల్లా అధ్యక్షుడు సుమిత్ ఖుంబేకర్  స్పందిస్తూ..  తాము అందించిన సగం ధర ఉన్న పెట్రోల్ కోసం ప్రజలు ఓపికగా ఎదురుచూసారని చెప్పారు. పెట్రోలు అసలు ధరలో సగానికి తగ్గించి ఇచ్చినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.100 దాటిన నేపథ్యంలో ఇలా చేయడం వైరల్ అయింది.

ఇవి కూడా చదవండి

రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తాను శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం కరోనా పెరుగుతున్న నేపథ్యంలో శస్త్రచికిత్స వాయిదా పడిందని అన్నారు. అయితే ప్రసుత్తం ఉన్న పరిస్థితుల్లో తాను ఎటువంటి రిస్క్ తీసుకోలేనని.. అందుకనే తన పుట్టిన రోజున ఎవరిని కలవలేదని చెప్పారు. నా శస్త్రచికిత్స వచ్చే వారం షెడ్యూల్ చేయబడింది.. కనుక తాను  ఇన్ఫెక్షన్ విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోలేను.. తన శస్త్రచికిత్సను మళ్లీ వాయిదా వేయలేనని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..