మనదేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రమేంటో తెలుసా ?

|

Apr 20, 2023 | 6:50 AM

ఫలానా మనిషి సంతోషంగా ఉన్నాడు, మరో వ్యక్తి బాధల్లో ఉన్నాడు అని మనుషులని ఎలా పోల్చుతామో రాష్ట్రాలను కూడా దేశాలను కూడా అలాగే లెక్కకడతారు. అయితే ఇటీవల మన దేశంలో నిర్వహించిన ఓ సర్వేలో ఈశాన్య రాష్ట్రమైన మిజోరం దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా తొలిస్థానంలో నిలిచింది.

మనదేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రమేంటో తెలుసా ?
Mizoram
Follow us on

ఫలానా మనిషి సంతోషంగా ఉన్నాడు, మరో వ్యక్తి బాధల్లో ఉన్నాడు అని మనుషులని ఎలా పోల్చుతామో రాష్ట్రాలను కూడా దేశాలను కూడా అలాగే లెక్కకడతారు. అయితే ఇటీవల మన దేశంలో నిర్వహించిన ఓ సర్వేలో ఈశాన్య రాష్ట్రమైన మిజోరం దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా తొలిస్థానంలో నిలిచింది. మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన స్టాట్రెజీ ప్రొఫెసర్‌ రాజేశ్‌ కె. పిలానియా దీనిపై అధ్యయనం చేశారు. అయితే ఇందులో కుటుంబ బంధాలు, వృత్తి, సామాజిక సమస్యలు, మతం, కొవిడ్-19 ప్రభావం,దాతృత్వం అనే ఆరు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని సర్వే చేపట్టారు. ఈ అంశాలు స్థానిక ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యం, ఆనందంపై ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయో అనే అంశాలను పరిశీలించారు. చివరికి మిజోరంను అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా గుర్తించారు.

అలాగే మిజోరం వందశాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రంగా కూడా గుర్తింపు ఉంది. విద్యాలయాల్లో స్థానిక ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లితండ్రులతో క్రమం తప్పకుండా సమావేశమవుతారు. విద్యార్థులు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నా తల్లిదండ్రులతో వారి విషయాల్ని చర్చించి పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తారు. కుల రహితమైన మిజోరం సమాజ నిర్మాణం కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. ఆడ, మగ అనే భేదాలు లేకుండా యువతీ, యువకులు 16, 17 ఏళ్ల వయసులోనే ఉపాధి పొందుతున్నారు. చిన్న వయసులోనే డబ్బులు సంపాదించడాన్ని ఇక్కడ చాలా ప్రోత్సహిస్తారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే వివక్ష అక్కడ చోటే ఉండదు. అలాగే మిజోరంలో ఉద్యోగం చేసే మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉంటారని నివేదిక వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి