Kerala: దారుణం..12 ఏళ్ల బాలికను గర్భవతి చేసిన సోదరుడు.. దిక్కుతోచని స్థితిలో కోర్టు మెట్లెక్కిన తల్లిదండ్రులు..

| Edited By: Janardhan Veluru

Jan 04, 2024 | 11:36 AM

మైనర్ సోదరుడి వలన గర్భవతి అయిన 12 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు కేరళ హై కోర్టుని ఆశ్రయించారు. చిన్న వయసులోనే గర్భం దాల్చిన తమ కూతురికి అబార్షన్‌ చేయాలని బాలిక తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుని విచారించిన కోర్టు వైద్యుల రిపోర్ట్స్ ని పరిగణలోకి తీసుకుని బాలిక గర్భం దాల్చి ఇప్పటికే 34 వారాలు అయింది.. పిండి పూర్తిగా అభివృద్ధి చెంది శిశివు రూపం సంతరించుకుందని కోర్ట్ పేర్కొంది. అంతేకాదు త్వరలో డెలివరీ జరిగే చాన్స్ ఉన్న ఈ సమయంలో అబార్షన్‌ చేయడం కష్టమన్న హైకోర్టు బాలిక తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టివేసింది.

Kerala: దారుణం..12 ఏళ్ల బాలికను గర్భవతి చేసిన సోదరుడు.. దిక్కుతోచని స్థితిలో కోర్టు మెట్లెక్కిన తల్లిదండ్రులు..
Woman Cheated
Follow us on

రోజు రోజుకీ బంధాలకు విలువ లేకుండా పోతోంది. అనైతిక సంబంధాలు పలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. అది కూడా తన సోదరుడి వలన గర్భవతి కావడంతో తల్లిదండ్రులు కోట్లు మెట్లు ఎక్కారు. తమ కూతురు గర్భాన్ని విచ్చితి చేయమంటూ హై కోర్టుని ఆశ్రయించారు. ఈ అనైతిక ఘటన కేరళలో చోటు చేసుకుంది. మైనర్ సోదరుడి వలన గర్భవతి అయిన 12 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు కేరళ హై కోర్టుని ఆశ్రయించారు. చిన్న వయసులోనే గర్భం దాల్చిన తమ కూతురికి అబార్షన్‌ చేయాలని బాలిక తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుని విచారించిన కోర్టు వైద్యుల రిపోర్ట్స్ ని పరిగణలోకి తీసుకుని బాలిక గర్భం దాల్చి ఇప్పటికే 34 వారాలు అయింది.. పిండి పూర్తిగా అభివృద్ధి చెంది శిశివు రూపం సంతరించుకుందని కోర్ట్ పేర్కొంది. అంతేకాదు త్వరలో డెలివరీ జరిగే చాన్స్ ఉన్న ఈ సమయంలో అబార్షన్‌ చేయడం కష్టమన్న హైకోర్టు బాలిక తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టివేసింది.

అయితే ఈ దశలో అబార్షన్ చేయడం అసాధ్యమని చెబుతూనే కాకపోతే, సిజేరియన్ ద్వారా లేదా సాధారణ ప్రసవం ద్వారా బిడ్డ పుట్టేందుకు అనుమతించాలని కోర్టు పేర్కొంది. డెలివరీ విషయంలో తుది నిర్ణయం వైద్య నిపుణులకు వదిలివేసినట్లు హైకోర్టు తెలిపింది. శిశివు జన్మించిన తర్వాత కోర్టు ఆ శిశివుకు రక్షణ కల్పిస్తుందని హమీనిచ్చింది.

కోర్టులో బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కూతురు గర్భవతి అన్న సంగతి తమకు ముందు తెలియదని.. ఇటీవలే తెలిసిందని చెప్పారు. అంతేకాదు తమ కూతురికి కేవలం 12 ఏళ్ళు.. కనుక ఈ వయసులో బిడ్డకు జన్మనిస్తే శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పారు. కనుక తమ కూతురుకి అబార్షన్ చేయించే అవకాశం ఇవ్వమని కోర్టుకు విన్నవించారు. అయితే తల్లిదండ్రుల వాదనను కోర్టు తోసిపుచ్చింది. మరో 15 రోజుల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉందని.. ఇప్పుడు అబర్షన్ చేస్తే తల్లిబిడ్డ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న హై కోర్టు అబార్షన్‌ చేయడాని వీల్లేదని తీర్పు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

గర్భవతి అయిన  మైనర్‌ బాలికను గర్భవతి చేసిన సోదరుడికి దూరంగా ఉంచాలని సూచిస్తునే ఆ బాలికను  తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంచాలని జస్టిస్‌ దేవన్‌ రామచంద్రన్‌ ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..