దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయుధ పూజ ఘనంగా నిర్వహిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వార్ మెమోరియల్ వద్ద విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో సరిహద్దులను కాపాడుతున్న సైనికులను రక్షణ మంత్రి కొనియాడారు. పుష్పగుచ్ఛం ఉంచిన అనంతరం సైనికులను ఉద్దేశించి రక్షణ మంత్రి మాట్లాడుతూ.. తమ విధి నిర్వహణలో సైనికులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలని ఉద్ఘాటించారు. సైనికుల అంకితభావంతో దేశానికి గర్వకారణమని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సైనికుల యూనిఫాం ప్రాముఖ్యత, సరిహద్దుల భద్రతను నిర్ధారించడంలో వారి ముఖ్యమైన పాత్రను రక్షణ మంత్రి రాజ్ నాథ్ మరోమారు ప్రస్తావించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రపంచ వేదికపై భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఆ ధైర్యాన్ని ఇచ్చిన ఘనత సైనికులకు సొంతం అని ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సాధించిన ఆర్థికాభివృద్ధి, ప్రగతిని ప్రశంసించిన రక్షణ మంత్రి, సరిహద్దుల రక్షణలో సైనికుల కృషి లేకుండా ఇలాంటి విజయాలు సాధించలేవని ఉద్ఘాటించారు.
తన పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ వ్యూహాత్మకంగా ముఖ్యమైన తవాంగ్ సెక్టార్‌లో మోహరించిన సైనికులతో సమావేశమయ్యారు. తవాంగ్‌లో సాంప్రదాయకమైన ఆయుధ పూజను నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతే కాకుండా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయన సైనికులతో కలిసి విజయదశమి వేడుకలు జరుపుకున్నారు. తవాంగ్ సెక్టార్‌లో చైనా పిఎల్‌ఎ ఆక్రమణలకు సంబంధించిన అనేక సంఘటనలు జరిగాయి. గత ఏడాది డిసెంబర్‌లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తవాంగ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)ని ఉల్లంఘించింది. అప్పటి నుండి సరిహద్దుల వద్ద మరింత భద్రత పెంచడం ఆవశ్యకత గురించి పదే పదే చెబుతూనే ఉంది. తగిన ఏర్పాట్లు చేస్తూ.. ఆర్మీకి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తూనే ఉంది.
विजयादशमी के पावन अवसर पर तवाँग में ‘शस्त्र पूजा’।
https://t.co/JIYcBbd1no— Rajnath Singh (@rajnathsingh) October 24, 2023
విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు, జీవితంలో ప్రతికూలతను తొలగించి మంచితనాన్ని అలవర్చుకోవాలని నొక్కి చెప్పారు. విజయదశమిని దసరా అని కూడా పిలుస్తారు. తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలను విజయదశమి వేడుకలతో ముగింపు పలుకుతారు.
देशभर के मेरे परिवारजनों को विजयादशमी की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व नकारात्मक शक्तियों के अंत के साथ ही जीवन में अच्छाई को अपनाने का संदेश लेकर आता है।
Wishing you all a Happy Vijaya Dashami!
— Narendra Modi (@narendramodi) October 24, 2023
దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ ప్రతికూల శక్తులను అంతం చేయడంతో పాటు జీవితంలో మంచిని అలవరచుకోవాలనే సందేశాన్ని తెస్తుందని పేర్కొన్నారు మోడీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..