Karnataka Election Results: పొలిటిక్ హైప్ క్రియేట్ చేసిన అసదుద్దీన్ రీట్వీట్.. మళ్లీ చేతులు కలుపుతారా?

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం వెనుక ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పాత్ర చాలా కీలకం అంటూ ప్రముఖ జర్నలిస్ట్ కితాబిచ్చారు. ఈ మేరకు సునీల్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌ను ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రీట్వీట్ చేశారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.

Karnataka Election Results: పొలిటిక్ హైప్ క్రియేట్ చేసిన అసదుద్దీన్ రీట్వీట్.. మళ్లీ చేతులు కలుపుతారా?
Asaduddin Owaisi

Updated on: May 13, 2023 | 3:42 PM

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం వెనుక ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పాత్ర చాలా కీలకం అంటూ ప్రముఖ జర్నలిస్ట్ కితాబిచ్చారు. ఈ మేరకు సునీల్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌ను ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రీట్వీట్ చేశారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.

‘సునీల్ కనుగోలు స్ట్రాటజీ కర్నాటకలో కాంగ్రెస్‌కు అధికారంలోకి తెచ్చింది. ఆ క్రెడిట్ సునీల్ కనుగొలుదే. ‘PayCM’ ప్రచారం మొదలు.. ఐదు హామీల వరకు ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, సమిష్టి నాయకత్వం ప్రచారానికి ఊపునిచ్చాయి.’ అని అర్వింద్ గుణశేఖర్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ ట్వీట్‌ను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రీట్వీట్ చేశారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ విజయానికి సంబంధించిన అంశాన్ని రీట్వీట్ చేయడం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా? అని విశ్లేషిస్తున్నారు రాజకీయ నిపుణులు. ఎంఐఎం అధినేత.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారా? రానున్న రోజుల్లో ఆ పార్టీకి సపోర్ట్‌గా నిలుస్తారా? అనే విశ్లేషణలు చేస్తున్నారు. ఏమో గుర్రం ఎగురవచ్చు అన్నట్లుగా.. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరుగొచ్చు. అసదుద్దీన్.. మళ్లీ కాంగ్రెస్‌కు సపోర్ట్‌గా నిలిచినా నిలవచ్చు.

ఇక కర్ణాటక ఎన్నికల్లో ఎంఐఎం హుబ్లీ ఈస్ట్ & బీజాపూర్ నియోజకవర్గాలలో ఒంటరిగా పోటీ చేయగా.. జంకండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి మద్ధతు ఇచ్చింది. అయితే, ఏ స్థానంలోనూ ఎంఐఎం ప్రభావం చూపలేకపోయింది. అయితే, ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలోనూ అభ్యర్థులను నిలబెడుతూ వస్తున్న ఎంఐఎం పై.. బీజేపీకి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఇస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. ఇప్పుడు అసదుద్దీ ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేయడం ఆసక్తి రేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..