దేశవ్యాప్తంగా మళ్ళీ మెట్రో రైళ్ల పరుగులు , నగరాల్లో కనిపించని ప్రయాణికుల సందడి

మహారాష్ట్రలో తప్ప దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మళ్ళీ మెట్రో రైలు  సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయిదు నెలల అనంతరం హోమ్ శాఖ ఆదేశాలతో మెట్రో రైళ్ల నిర్వహణకు అనుమతి లభించింది..

దేశవ్యాప్తంగా మళ్ళీ మెట్రో రైళ్ల పరుగులు , నగరాల్లో కనిపించని ప్రయాణికుల సందడి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 07, 2020 | 11:57 AM

మహారాష్ట్రలో తప్ప దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మళ్ళీ మెట్రో రైలు  సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయిదు నెలల అనంతరం హోమ్ శాఖ ఆదేశాలతో మెట్రో రైళ్ల నిర్వహణకు అనుమతి లభించింది. ఢిల్లీ, నోయిడా, బెంగుళూరు, చెన్నై,లక్నో వంటి నగరాల్లో ఈ సర్వీసులు మొదలైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ప్రయాణికులు కోవిడ్ గైడ్ లైన్స్ ని తప్పనిసరిగా పాటించాలని హోమ్ శాఖ  సూచించింది.  శానిటైజర్లు, మాస్కులు తప్పనిసరి అని నిర్దేశించింది. అయితే ఇన్ని నెలల తరువాత మెట్రో రైళ్లు ప్రారంభమైనప్పటికీ చాలా చోట్ల ప్రయాణికుల సందడి అంతగా కనిపించలేదు. వీరి సంఖ్య మెల్లగా పెరగవచ్చునని భావిస్తున్నారు.

అనేక చోట్ల స్టేషన్లలో రైళ్ల సమయాన్ని కుదించడం, తక్కువగా పట్టాల మీదికి ఎక్కిన రైళ్లు ఇందుకు ప్రధానకారణాలుగా తెలుస్తోంది.