రాజస్థాన్‌లో నేలను తాకిన “ఉల్క”

రాజస్థాన్‌లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. జాలోర్ జిల్లా సంచౌరీ పట్టణ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం 7గంటల సమయంలో స్థానిక ఈ ఉల్కాపాతం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అంతా చూస్తుండగా ఆకాశం నుంచి ఓ మెరుపు నేలను తాకింది. రాకెట్ లాంచర్ అనుకుని అంతా భయందోళనకు గురయ్యారు. నేలను తాకిన కాసేపటికి అక్కడి అధికారులు చేరుకున్నారు. 2.8కిలోల బరువున్న ఉల్క.. ఈ ఉల్క దాదాపు 2.8కిలోల బరువుందని, నేలపై నుంచి 2, […]

రాజస్థాన్‌లో నేలను తాకిన ఉల్క
Follow us

|

Updated on: Jun 20, 2020 | 4:12 PM

రాజస్థాన్‌లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. జాలోర్ జిల్లా సంచౌరీ పట్టణ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం 7గంటల సమయంలో స్థానిక ఈ ఉల్కాపాతం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అంతా చూస్తుండగా ఆకాశం నుంచి ఓ మెరుపు నేలను తాకింది. రాకెట్ లాంచర్ అనుకుని అంతా భయందోళనకు గురయ్యారు. నేలను తాకిన కాసేపటికి అక్కడి అధికారులు చేరుకున్నారు.

2.8కిలోల బరువున్న ఉల్క..

ఈ ఉల్క దాదాపు 2.8కిలోల బరువుందని, నేలపై నుంచి 2, 3 అడుగుల లోతులో దీనిని గుర్తించామని తెలిపారు. ఈ ఉల్క నేలతాకినప్పుడు భారీ శబ్దం వచ్చినట్లు చెప్పారు. ఈ శబ్దం సుమారు చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల వరకు వినిపించిదంటున్నారు. ఉల్కను సేకరించి బద్రపరిచామని .. అలాగే ఇంకేమైన ఉల్కలు పడ్డాయేమోనని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించామని అన్నారు. అయితే ఎక్కడ ఎటువంటి అలాంటి జాడలు లభించలేదన్నారు. ఈ ఉల్కపై పరిశోధనలు చేసేందుకు ఢిల్లీకి పంపించనున్నామని వెల్లడించారు.

ఉల్కలు అంటే… ఉల్కలు అంటే.. గ్రహశకలాలు పరస్పరం ఢీకొన్నప్పుడు వాటి నుంచి విడిపోయే చిన్న రాతి ముక్కల్నే ఉల్కలుగా పిలుస్తారు. అంగారకుడు, చంద్రుడి వంటి గ్రహాలను ఆస్టరాయిడ్లు ఢీ కొన్నప్పుడు ఆ గ్రహాల నుంచి అంతరిక్షంలోకి విడిపోయే ముక్కలు కూడా ఉల్కలు అని అంటారు. వీటిలో ఉండే ఖనిజ, రసాయన పదార్థాలను బట్టి ఇవి వేర్వేరు రకాలుగా చూస్తారు. ఇవి సాధారణంగా భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతుంటాయి. ఇలా ఉల్కలు భూ వాతావరణంలోకి రావటంతో మండిపోవడాన్నే ఉల్కాపాతంగా అంటారు.

Latest Articles