AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ ప్రసంగంపై అపోహలొద్దు… పీఎంఓ ఖండన

లదాఖ్ లో ఇటీవల ఇండో-చైనా సైనికుల ఘర్షణపై ప్రధాని మోదీ నిన్న అఖిలపక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై అపోహలు సృష్టించే విధంగా విమర్శలు వస్తున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం ఆరోపించింది. ఈ తీరును ఖండించింది. గాల్వన్ వ్యాలీలో..

ప్రధాని మోదీ ప్రసంగంపై అపోహలొద్దు... పీఎంఓ ఖండన
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 20, 2020 | 4:19 PM

Share

లదాఖ్ లో ఇటీవల ఇండో-చైనా సైనికుల ఘర్షణపై ప్రధాని మోదీ నిన్న అఖిలపక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై అపోహలు సృష్టించే విధంగా విమర్శలు వస్తున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం ఆరోపించింది. ఈ తీరును ఖండించింది. గాల్వన్ వ్యాలీలో ఈ నెల 15 న వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికులు కొత్తగా నిర్మాణాలు చేపట్టారని, అయితే ఆలాంటి చర్యలకు దూరంగా ఉండాలన్న మన దేశ జవాన్ల కోర్కెను వారు నిరాకరించారని ఈ కార్యాలయం వివరించింది. వాస్తవాధీన రేఖ పొడవునా గల పరిస్థితిపై.. ముఖ్యంగా 20 మంది భారత సైనికుల మృతికి దారి తీసిన పరిస్థితిపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేసిన విషయాన్ని పీఎంఓ ప్రస్తావిస్తూ.. అక్కడి పరిణామాలను మోదీ.. విదేశాంగ శాఖ నుంచి తెలుసుకున్నాకే.. అఖిల పక్ష సమావేశంలో మాట్లాడారని స్పష్టం చేసింది.

కాగా-చైనా దురాక్రమణకు మోదీ లొంగిపోయారా ? ఒకవేళ సంబంధిత భూభాగం చైనీయులదే అయితే మన సైనికులు ఎందుకు మరణించారు ? ఎక్కడ చనిపోయారు ? అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ట్వీట్ చేశారు. గాల్వన్ వ్యాలీ ఘటన జరిగిన మరుసటి రోజున విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ.. అక్కడి యధాతథ పరిస్థితిని మార్చడానికి చైనీయులు ఏకపక్షంగా జరిపిన ప్రయత్నం వల్లే ఉభయదేశాల దళాల మధ్య ఘర్షణ జరిగిందని తెలిపింది. కానీ…. యధాతథ పరిస్థితి మార్పు అంటే మోదీ పూర్తిగా వివరాలు చెప్పలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. చైనీయులు భారత భూభాగంలోకి చొరబడలేదన్నదే దీని ఉద్దేశమా అని అడిగాయి. అలాంటప్పుడు ఈ పరిస్థితి పునరుధ్ధరణ అన్న పదాన్ని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఎందుకు ఉపయోగించారని కూడా కాంగ్రెస్ నేత పి.చిదంబరం ప్రశ్నించారు. మన సాయుధ దళాల ధైర్య సాహసాల మూలంగా మన సరిహద్దుల్లో చైనీయుల   ఉనికి లేదని మోదీ స్పష్టం  చేశారని ప్రధాన మంత్రి కార్యాలయం వివరించింది.