AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మా గ్రామంలో ఆడోళ్లు తెగ తాగేస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన పురుషులు

ఇదో వింత కేసు.. బుహుశా ఇలాంటి వ్యవహారం గురించి మీరు ఎప్పుడూ విని ఉండరు. మా ఆడోళ్లు తాగుబోతులైపోతున్నారు సారూ.. గ్రామంలోని కొందరు మగవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కష్టాన్ని ‘తాగేస్తున్నారని’ ఫిర్యాదు చేశారు. డిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లాలో ఈ వింత కేసు వెలుగుచూసింది.

Viral: మా గ్రామంలో ఆడోళ్లు తెగ తాగేస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన పురుషులు
Kondaguda Men
Ram Naramaneni
|

Updated on: Mar 13, 2025 | 11:02 AM

Share

ఒడిశాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా తమ భర్తలు మద్యం సేవించి తమను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, ఇంటిని పట్టించుకోవడంలేదని మహిళలు తమ భర్తలపై ఫిర్యాదు చేయడం మనం చూశాం. కానీ కొందరు భర్తలు తమ భార్యలు పెట్టే బాధలనుంచి తమను కాపాడమని పోలీసులను ఆశ్రయించారు. వారు మద్యం సేవించి ఇల్లు గుల్ల చేయడమే కాకుండా తమను చిత్రహింసలు పెడుతున్నారని లబోదిబోమంటున్నారు.

పురుషులకంటే మేమేం తక్కువకాదు.. అనుకున్నారో ఏమో ఆ గ్రామానికి చెందిన మహిళలు మద్యం సేవిస్తూ పురుషులకు ఛాలెంజ్‌ విసురుతున్నారు. ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా బొరిగుమ్మసమితిలోని పూజారిపుట్‌ పంచాయతీ కొండగూడ గ్రామంలోని కొందరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. తమ భార్యలు మద్యానికి బానిసలై ఇల్లు గుల్ల చేస్తున్నారని, తాము కష్టపడి సంపాదించుకొస్తుంటే.. ఆడబ్బుతో తాగుతూ.. ఇంటిని గాలికొదిలేస్తున్నారని ఫిర్యాదు చేశారు. గ్రామంలోని కొందరు యువకులు సారా తయారు చేసి విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తాము కూలి చేసి డబ్బులు సంపాదించి తెస్తుంటే తమ భార్యలు ఆ డబ్బులు మొత్తం మద్యానికే ధారబోస్తున్నారని వాపోయారు. తమ భార్యల తీరుతో సంసారాలు గడవడం కష్టంగా మారిందిని, పిల్లల బతుకు అంధకారమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సారా తయారీదారులపై చర్యలు తీసుకుని తమ కుటుంబాలను, గ్రామాన్ని రక్షించాలని పోలీసులను, అబ్కారీ అధికారులను కలిసి వేడుకున్నారు. వారి ఫిర్యాదును స్వీకరించిన అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?