కేరళలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వందలాది మంది శిధిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) బాధిత ప్రాంతంలో ఫైర్ ఫోర్స్ , NDRF బృందాలను మోహరించినట్లు తెలిపింది. అంతేకాదు సహాయక చర్యలకోసం ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన మరో బృందం తమిళనాడు లోని అరకోణం నుంచి వాయనాడ్‌కు తరలించారు.
KSDMA ఫేస్‌బుక్ పోస్ట్ ప్రకారం కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ కు చెందిన రెండు బృందాలను కూడా రెస్క్యూ ప్రయత్నాలలో సహాయం చేయడానికి వాయనాడ్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే ఆదేశాల్ మేరకు ఈ బృందాలు సంఘటనా స్థలానికి బయలుదేరాయి. కొండ చరియల కింద చాలా మంది చిక్కుకుపోయి ఉంటారని భయాందోళన చెందుతున్నట్లు బాధిత ప్రాంతాల స్థానికులు తెలిపారు. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
అన్ని ప్రభుత్వ సంస్థలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కార్యకలాపాలు సమన్వయంతో జరుగుతాయి, సహాయ కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి రాష్ట్ర మంత్రులు కొండ జిల్లాకు చేరుకుంటారని సీఎం కార్యాలయం నుంచి విడుదల అయిన ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ముండకైలో కొండచరియలు విరిగిపడటంతో రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా కష్టతరంగా మారింది. ప్రస్తుతం రోడ్లు అన్నీ కొండ చరియలతో బ్లాక్ చేయబడి ఉన్నాయి. దీంతో రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోలేక పోతున్నారు. ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు.
Horrible visuals of landslide coming in from Meppadi, Wayanad.#Wayanad #Landslide #Kerala pic.twitter.com/4DHZYV7Ciu
— West Coast Weatherman (@RainTracker) July 30, 2024
భారీ వర్షం తర్వాత విరిగిపడిన కొండచరియలు
వాస్తవానికి కేరళలోని వాయనాడ్‌లోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ శిధిలాలల కింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే బాధితుల సహాయార్ధం జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిందని, అత్యవసర సహాయం కోసం 9656938689 , 8086010833 హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు ఎంఐ-17, ఒక ఏఎల్‌హెచ్ సూలూరు నుంచి ఉదయం 7.30 గంటలకు బయలు దేరాయి.
Kerala: Landslide occurs in Wayanad following heavy rainfall. Health Department – National Health Mission has opened a control room and issued helpline numbers 9656938689 and 8086010833 for emergency assistance. Two Air Force helicopters Mi-17 and an ALH will depart from Sulur…
— ANI (@ANI) July 30, 2024
వైతిరి, కల్పత్త, మెప్పాడి, మనంతవాడితో సహా ప్రాంతంలోని అన్ని ఆసుపత్రులు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. అత్యవసర సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆరోగ్య కార్యకర్తలు సేవలను అందించడానికి సంఘటన స్థలానికి, ఆస్పత్రుల వద్దకు హుటాహుటిన చేరుకున్నారని, మరింత సహాయాన్ని అందించడానికి అదనపు బృందాలను వయనాడ్‌కు మోహరించనున్నట్లు జార్జ్ చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..