గుజరాత్‌లో ఎగసిపడ్డ మంటలు
గుజరాత్‌లో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. జునాఘడ్ శివారులో ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో పెద్దఎత్తున అగ్నికీలల ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీలోని మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ దగ్దమైపోయింది. అసలే ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు మరింతగా అంటుకున్నాయి. ఎగసిపడ్డ మంటల్లో ఫ్యాక్టరీలో ఉన్న సరుకంతా కాలిబూడిదైంది. అగ్నిప్రమాద సంఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటా హుటీనా ఘటనాస్ధలానికి వచ్చి మంటల్ని ఆర్పివేశారు. ఈ ఫైర్ యాక్సిడెంట్‌లో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. […]
గుజరాత్‌లో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. జునాఘడ్ శివారులో ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో పెద్దఎత్తున అగ్నికీలల ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీలోని మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ దగ్దమైపోయింది. అసలే ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు మరింతగా అంటుకున్నాయి. ఎగసిపడ్డ మంటల్లో ఫ్యాక్టరీలో ఉన్న సరుకంతా కాలిబూడిదైంది. అగ్నిప్రమాద సంఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటా హుటీనా ఘటనాస్ధలానికి వచ్చి మంటల్ని ఆర్పివేశారు. ఈ ఫైర్ యాక్సిడెంట్‌లో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. దాదాపు రూ. 25 లక్షల ఆస్తినష్టం జరిగిఉంటుందని అగ్నిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు.