బాణాసంచా మార్కెట్‌లో మంటలు.. 700కి పైగా దుకాణాలు దగ్ధం.. కోట్లల్లో ఆస్తినష్టం

|

Oct 25, 2022 | 4:54 PM

అగ్నిమాపక కేంద్రం సమీపంలో మార్కెట్‌ ఉన్నప్పటికీ ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులే స్వయంగా ఫైర్‌ స్టేషన్‌కి వెళ్లి సమాచారం అందించాల్సి వచ్చిందని వాపోయారు.

బాణాసంచా మార్కెట్‌లో మంటలు.. 700కి పైగా దుకాణాలు దగ్ధం.. కోట్లల్లో ఆస్తినష్టం
Firecrackers Ban
Follow us on

దీపావళి పండగ వేళ టపాసుల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ప్రమాదవశాత్తు దుకాణ సముదాయాల్లో మంటలు చెలరేగడంతో 700 దుకాణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. వ్యాపారులకు కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దారుణ సంఘటన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో చోటు చేసుకుంది. స్థానిక మార్కెట్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 700 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్టుగా తెలిసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఇటానగర్‌ సమీపంలోని నహర్‌లగన్‌ డైలీ మార్కెట్‌లో బాణాసంచా కాల్చడం, దీపాలు వేలిగించడం వల్ల ప్రమాదం సంభవించినట్టుగా అధికారులు పేర్కొన్నారు. ఘోర అగ్నిప్రమాదంలో రూ.3 కోట్లకు పైగా విలువైన ఆస్తులు, వస్తువులు దగ్ధమయ్యాయి.

మార్కెట్‌లో వెదురు, కలపతో తయారు చేసిన పొడి వస్తువులు విస్తారంగా నిల్వ ఉండడంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అగ్నిమాపక కేంద్రం సమీపంలో మార్కెట్‌ ఉన్నప్పటికీ అగ్నిమాపక అధికారులు సకాలంలో స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులు స్వయంగా ఫైర్‌ స్టేషన్‌కి వెళ్లి సమాచారం అందించాల్సి వచ్చిందన్నారు. కార్యాలయంలో సిబ్బంది కనిపించడం లేదని దుకాణదారులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు గంటలపాటు మంటలు రెండు దుకాణాలకే పరిమితమయ్యాయని, అయితే, ఫైర్‌ డిపార్టుమెంట్‌ వైఫల్యంవల్ల ఆ తర్వాత చుట్టుపక్కల అన్ని దుకాణాలకు విస్తరించాయని స్థానికులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపు తామే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించామని వాపోయారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నహర్లగన్ బజార్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కిపా నాయ్ అతనిని సర్వీస్ నుండి తొలగించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. అరుణాచల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ACC&I) ప్రెసిడెంట్ తార్ నాచుంగ్ విధుల్లో ఉన్న ఫైర్‌మెన్‌లందరినీ నిర్లక్ష్యం చేసినందుకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈటానగర్ ఎమ్మెల్యే టెకీ కాసో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏసీసీ, ఐల సహకారంతో మార్కెట్‌ను పునర్‌నిర్మిస్తుందని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి