Silver Price Today: ఒక వైపు బంగారం ధర తగ్గుముఖం పడుతుంటే.. వెండి మాత్రం మరీ స్వల్పంగా పెరిగింది. ఇటీవల బడ్జెట్‌లో బంగారం పై దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత పసిడి ధరలు గణనీయంగా దిగివస్తున్నాయి. కానీ వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే బంగారం తగ్గుతుంటే వెండి స్వల్పంగా పెరిగింది. తాజా వెండిపై పది రూపాయలు పెరిగింది. ఇక దేశీయంగా వెండి కిలో ధర రూ.66,700ఉంది.
దేశీయంగా వెండి ధరలు ఇలా..
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 66,700 గా ఉంది, అలాగే దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కిలో వెండి ధర 66,700గా ఉంది. అదేవిధంగా చెన్నైలో కిలో వెండిధర రూ. 71,100 ఉండగా, బెంగళూరులో కిలో వెండి ధర రూ.66.700ఉంది. ఇక కోల్‌కతాలో కిలో వెండి రూ.66.700 ఉండగా, హైదరాబాద్‌లో రూ.71,100 ఉంది. అలాగే విజయవాడలో రూ.71,100ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Viral News: ఎంత చిత్రం గురూ..! 29 వేల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయట.. కోర్టుకు తెలిపిన పోలీసులు