ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో సిసోడియాకు బెయిలే ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ శుక్రవారం తీర్పునిచ్చారు. లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టైన సిసోడియా ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఏప్రిల్ 3 వరకు ఈ విచారణ కొనసాగనుంది. ఇప్పటికే నెల రోజులకు పైగా జైలులోనే ఉంటున్నందున తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా సిసోదియా రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.అయితే కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
అయితే ఆప్ నేత బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ.. సీబీఐ తరపున డీపీ సింగ్ వాదనలు వినిపించారు. అతనికి బెయిల్ మంజూరు చేయడం తమ దర్యాప్తును దెబ్బతీస్తుందని, సిసోడియా సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు, సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ కోర్టుకు తన వాదనలు వినిపిస్తూ.. తాము సెక్షన్ 41A CrPC నోటీసులకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఇదిలా ఉండగా ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగిన వ్యవహారంలో ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం..