AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురు పెళ్లికి రూ.55 కోట్లు ఖర్చు చేసిన ధనవంతుడు!.. ఎనిమిదేళ్లు దాటినా జనాల్లో అదే ముచ్చట..!!

వివాహానికి 40 దేశాల నుండి 30,000 మందికి పైగా హాజరయ్యారు. ఇందులో ఖతార్ రాజకుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ వివాహ వేడుకలలో బహుబాష నటి శోభన, మళయాల చిత్ర హీరోయిన్ మంజు వారియర్ తో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, స్టీఫెన్ దేవన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ షో ఏర్పాటు చేశారు. 

కూతురు పెళ్లికి రూ.55 కోట్లు ఖర్చు చేసిన ధనవంతుడు!.. ఎనిమిదేళ్లు దాటినా జనాల్లో అదే ముచ్చట..!!
Kerala's Richest Man 1
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2023 | 6:16 PM

Share

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. అలాంటి పెళ్లిని పదికాలాల పాటు గుర్తుండిపోయేలా జరుపుకోవాలని అందరూ భావిస్తారు.. అయితే, సామాన్యులు తమ పెళ్లి కోసం ఒకటి రెండు లక్షలు ఖర్చుపెడితే, మధ్యతరగతి వారు పది లక్షల నుండి ఇరవై లక్షల వరకు ఖర్చుచేస్తారు. ధనవంతులైతే ఇంకొంచెం ముందుకెళ్లి మరీ లక్షలు కుమ్మరిస్తుంటారు. అలాగే, కేరళలో కొన్నాళ్ల క్రితం జరిగిన ఒక వివాహ వేడుకకు రూ.55 కోట్లు ఖర్చు చేశారు. భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త, బి. రవి పిళ్లై 2015లో తన కుమార్తె ఆరతీ పిళ్లై వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. ఎనిమిదేళ్లు దాటినా పెళ్లి గురించి మాట్లాడుకునేంత వైభవంగా ఈ పెళ్లి జరిగింది.

Kerala's Richest Man

రవి పిళ్లై కుమార్తె ఆర్తి పిళ్లై, వృత్తిరీత్యా వైద్యుడైన ఆదిత్య విషుని నవంబర్ 26, 2015న కేరళలోని కొల్లంలో వివాహం చేసుకుంది. పెళ్లిలో రవి పిళ్లై తన సంపదను ప్రదర్శించారు. కేరళలోని కొల్లంలోని ఆశ్రమం మైదాన్‌లో ఎన్నారై వ్యాపారవేత్త రవిపిళ్లై కుమార్తె డాక్టర్ ఆరతీ వివాహం అట్టహాసంగా జరిగింది. కొచ్చికి చెందిన డాక్టర్ ఆదిత్య విష్ణుతో తన కుమార్తె డాక్టర్ ఆరతి రవి పిళ్లై వివాహానికి రూ.55 కోట్లు ఖర్చు వెచ్చించారు. రవి పిళ్లై 2.8 బిలియన్ డాలర్ల (₹18,200 కోట్లు) సంపదతో అత్యంత సంపన్న కేరళీయులలో ఒకరుగా ఉన్నారు.. వివాహానికి 40 దేశాల నుండి 30,000 మందికి పైగా హాజరయ్యారు. ఇందులో ఖతార్ రాజకుటుంబాలు కూడా ఉన్నాయి.

Kerala's Richest Man 2

అసాధారణమైన కమలం-నేపథ్య మండపం అద్భుతమైన వివాహం వేదిక ఏర్పాటు చేశారు. చిత్ర కళా దర్శకుడు సాబు సిరిల్ నేతృత్వంలోని 200 మంది నిపుణుల బృందం పెళ్లి మండపాన్ని నిర్మించింది. వివాహా వేడుకలు నిర్వహించడానికి 8 ఎకరాలలో భారీగా సెట్టింగ్స్ వేశారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబాలి చిత్రానికి సెట్స్ వేయించినా ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ తో రూ. 20 కోట్లు ఖర్చు పెట్టించి సెట్టింగ్స్ వేయించారు. మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి ప్రముఖ సినీ నటులు ఈ వేడుకకు హాజరయ్యి మరింత ఆకర్షణీయంగా నిలిచారు. శాంసంగ్ మరియు జపాన్ గ్యాస్ కార్పొరేషన్ వంటి ప్రసిద్ధ CEO లు కూడా కనిపించారు. వివాహ విందులో సంప్రదాయ సధ్య, పదిరకాల పాయసాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న VVIPల కోసం వివిధ రకాల వంటకాలు సిద్ధం చేశారు. ఈ వివాహ వేడుకలలో బహుబాష నటి శోభన, మళయాల చిత్ర హీరోయిన్ మంజు వారియర్ తో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, స్టీఫెన్ దేవన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ షో ఏర్పాటు చేశారు.

ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన పట్టు చీరలో డాక్టర్ ఆర్తి పిళ్లై అద్భుతంగా కనిపించింది. కాషాయరంగు చీరలో సంప్రదాయ వస్త్రధారణతో దక్షిణ భారత వివాహ శోభను చాటింది. ఆమె దుస్తులలోని ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఆమె తన పెళ్లి రోజున వజ్రాలు మాత్రమే ధరించింది. వజ్రాభరణాలలో వధువు చాలా అందంగా కనిపించింది. ఆమె డైమండ్ చోకర్ నెక్లెస్‌, లేయర్డ్ హార్, కమర్‌బంధ్, బాజుబంధ్, మఠంపట్టీ, డైమండ్ బ్యాంగిల్స్‌తో యాక్సెసరైజ్ చేసింది. మొత్తం మీద ఈ పెళ్లి కేరళ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..