కుండపోత వర్షాలకు కుంగిన రోడ్డు.. ఒరిగిన సిటీ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..
కొన్ని ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు పొంగిపోర్లింది. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఈ రోజు కూడా మేఘావృతమైన వాతావరణం కొనసాగుతుందని, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిసింది.
దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ సిటీ బస్సు గోతిలో ఇరుక్కుపోయింది. వాహనాల రాకపోకలతో ఎప్పుడూ రద్దీ ఉండే హాజ్ రాణి రెడ్ లైట్ సమీపంలోని ప్రెస్ ఎన్‌క్లేవ్ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. దాంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
బస్సు రోడ్డుకు ఇంకొంచం ఎడమవైపునకు వచ్చి ఉంటే గొయ్య ఇంకా పెద్దగా ఏర్పడేది. బస్సు పూర్తిగా గోతిలో పడిపోయేది. అదే జరిగి ఉంటే బస్సులోని ప్రయాణికుల్లో చాలా మందికి గాయాలు అయ్యేవి. సాకేత్ కోర్టు నుంచి మాలవీయ నగర్ పీటీఎస్ కు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.
#WATCH | Delhi: Repair work is underway at a portion of a road that caved in near Hauz Rani Red Light on Press Enclave Road. pic.twitter.com/zJaIeBmiHr
— ANI (@ANI) March 31, 2023
జాతీయ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు పొంగిపోర్లింది. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఢిల్లీలో ఈరోజు కూడా మేఘావృతమైన వాతావరణం కొనసాగుతుందని, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. వాతావరణ సంస్థ శుక్రవారం ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతానికి “ఆరెంజ్ అలర్ట్” జారీ చేసింది.
ఇదిలా ఉంటే, గత నెలలో ఢిల్లీలోని ఆర్‌కె పురంలో ఒక రహదారి కూలిపోవడంతో ఏర్పడిన గొయ్యిలో ఒక కుక్క, రెండు బైక్‌లు పడిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..