Delhi Airport: అక్రమ రవాణా కోసం చివరకు తినే ఆహారాన్ని కూడా వదలడం లేదు.. అక్రమార్కులు. తాజాగా యుఎస్ డాలర్లను అక్రమంగా తీసుకుని వెళ్ళడానికి తినే ఆహారమైన అప్పడాల ప్యాకెట్ ను ఉపయోగించుకున్నాడు. ఈ షాకింగ్ కేసు దేశ రాజధాని హస్తినలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భారత దేశం నుంచి బ్యాంకాక్ కు వెళ్తున్న ఓ వ్యక్తి కరకరలాడే పాపడ్ ప్యాకెట్ పొరల యుఎస్ డాలర్లను (భారతీయ కరెన్సీలో సుమారు రూ.15 లక్షలు) పెట్టుకుని తీసుకుని వెళ్తున్నాడు. ఈ విషయాన్నీ గుర్తించిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సిఐఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. వాస్తవానికి, ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-III వద్ద భద్రతా తనిఖీల్లో భాగంగా ప్రయాణీకులను ఉదయం 5 గంటలకు ఆపారు. నిందితుడి రిషికేశ్ వద్ద తనిఖీ చేయగా పాపాడ్ ప్యాకెట్ మధ్యలో దాచి ఈ కరెన్సీని వెలుగులోకి వచ్చింది.
पापड़ के पैकेट में डॉलर ही डॉलर…
दिल्ली एयरपोर्ट पर 15 लाख डॉलर के साथ पकड़ा गया शख्स. #papad pic.twitter.com/up1HCW7jxE
— Nitesh Ojha (@niteshojha786) August 2, 2022
ఎయిర్ పోర్ట్ సిబ్బంది అనుమానంతో.. నిందితుడి రిషికేష్ లగేజీని తనిఖీ చేయడం కోసం యాదృచ్ఛికంగా చెకింగ్ పాయింట్‌కు తీసుకెళ్లినట్లు సిఐఎస్‌ఎఫ్ అధికారి తెలిపారు. అతని లగేజీని ఎక్స్‌రే యంత్రం ద్వారా తనిఖీ చేయగా, లగేజీలో కొంత విదేశీ కరెన్సీ దాచిన అనుమానాస్పద ఫోటో కనిపించింది. అయితే ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారులు, కస్టమ్స్ శాఖ అధికారులకు చెప్పారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ప్రయాణీకుడి నుండి మొత్తం $ 19,900 US డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ కరెన్సీలో వీటి విలువ దాదాపు 15న్నర లక్షల రూపాయలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..