Man Dies: గిన్నె విసరడంతో ఇద్దరు తోడి కొడళ్ల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జైపూర్‌లోని పండా మండీ ప్రాంతంలో షారుఖ్ అని ముగ్గురు అన్న దమ్ములు నివాసం ఉంటున్నారు. వీరందరికీ వివాహం జరిగింది. అయితే షారుఖ్ భార్య ఫరియాకి.. అతని అన్న మొహసీన్ భార్యకు అస్సలు పడేది కాదు. నిరంతరం ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది.
కాగా, ఇటీవల షారూఖ్ ఇంట్లో ప్రత్యేక వంటకం చేయగా.. దానిని తన అన్నకు ఇవ్వమని అతని భార్య ఫరియాకు చెప్పాడు. దాంతో ఫరియా ఆ వంటకాన్ని తీసుకెళ్లి షారూఖ్ అన్న మొహసీన్‌కి ఇవ్వబోగా వద్దని చెప్పాడు. దాంతో ఫరియా వెనక్కి తిరిగి వచ్చింది. షారూఖ్ మళ్లీ వెళ్లి ఇచ్చిరమ్మని చెప్పడంతో.. ఫరియా ఆగ్రహంగా ఆ వంటకాన్ని తీసుకెళ్లి మొహసీన్ ఇంట్లో విసిరి కొట్టింది. ఈ ఘటనతో ఆగ్రహించిన మొహసీన్ భార్య.. ఫరియాతో ఘర్షణకు దిగింది. ఇద్దరూ పరస్పరం భౌతిక దాడులకు దిగారు. దాంతో వారిద్దరినీ విడదీసేందుకు మొహసీన్ ప్రయత్నించాడు. ఆగ్రహంగా ఉన్న ఫరియా.. పక్కనే ఉన్న కత్తిని తీసుకుని మొహసీన్ కడుపులో పొడిచింది. దాంతో మొహసీన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఫరియాను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
Also read:
Cryptocurrency: పునరాలోచన చేయండి..! క్రిప్టోకరెన్సీపై బ్యాంకులకు ఆర్బీఐ సూచనలు..!
కష్టసమయంలో ముందుకువచ్చిన హీరోలు…ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీవిరాళాలు అందించిన సినిమాతారలు..
కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన… అయోమయంలో కస్టమర్లు..