
తరాలు మారిన కుల పట్టింపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఒక అబ్బాయి లేదా అమ్మాయి తమ కులం కాకుండా వేరే కులం వాళ్లని ప్రేమించానని, పెళ్లిచేసుకోవాలని చెప్తే.. కేవలం కులం కారణంగా వారిని అడ్డుకునే తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. కొంతమందైతే ఏకంగా దాడులు కూడా చేస్తారు. అయితే ఓ తండ్రి తన కొడుకు దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఏకంగా ప్రాణాలు తీశాడు. ఈ ఘటన తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా అరుణపాఠి గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాళ్లోకి వెళ్తే సుభాష్ అనే వ్యక్తి ..దళిత కులానికి చెందిన అనుసూయ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇల్లు వదిలి తన భార్యతో కలిసి వెళ్లిపోయాడు. అయితే సుభాష్ వాళ్ల నాన్న దండనపాని తిర్పూర్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. శుక్రవారం రోజున తన గ్రామమైన అరుణపాఠికి వచ్చాడు. తన కొడుకుకి ఫోన్ చేసి భార్యతో కలిసి ఇంటికి రమ్మని కబురు పెట్టని తన తల్లి కన్నమ్మల్ కు చెప్పాడు. ఆమె తన మనువడికి ఫోన్ చేసి చెప్పడంతో సుభాష్ తన భార్యతో కలిసి శుక్రవారం సాయంత్రం 4.00 గంటలకు ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులందరు కలిసి కాసేపు గడిపారు. రాత్రి భోజనం చేశాక అందరు నిద్రపోయారు. శనివారం తెల్లవారుజామున తండ్రి దండపాని.. తన కొడుకు సుభాష్, కొడలు అనుసూయపై కత్తితో దాడి చేశాడు. ఇది గమనించి ఆ దాడిని ఆపేందుకు వచ్చిన అతని తల్లి కన్నమ్మల్ పై కూడా దండపాని దాడి చేశాడు. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి పారిపోయాడు.
చివరికి రోడ్డు పక్కన సుభాష్ భార్య రక్తపు ముడుగుల్లో ఉండటాన్ని చూసిన గ్రామస్థులు.. ఆ ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అయితే సుభాష్, అతని నానమ్మ కన్నమ్మల్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం అనసూయకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసలు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు దండపాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం