
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. తన ఫ్లాట్‌ను అమ్మాయిలకు రెంటు ఇచ్చి వాళ్లకు తెలియకుండా కెమెరాలు పెట్టి వాళ్ల వ్యక్తిగత వీడియోలు చూసే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఉదయ్‌పూర్‌లోని రాజేంద్ర సోనీ అనే వ్యక్తి వేరే పట్టణాల నుంచి అక్కడికి చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు అమ్మాయిలకు 8 నెలల క్రితం తన ఫ్లాట్‌ను రెంట్ కు ఇచ్చాడు. అయితే ఓ రోజు వాళ్లు సెలవులు వచ్చినప్పడు తమ ఇంటికి వెళ్లారు. దీంతో రాజేంద్ర సోని తన వద్ద ఉన్న డూప్లికేట్ తాళాలతో ఆ ఫ్లాట్‌ను తెరిచాడు. బెడ్‌రూం, బాత్‌రూంలలో స్పై కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆ అమ్మాయిలు ఫ్లాట్‌కు వచ్చిన తర్వాత వాళ్ల వీడియోలను రాజేంద్ర చూసేవాడు.
అయితే ఇటీవల ఓ రోజు ఆ ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. అక్కడికి వచ్చిన ఎలక్ట్రీషియన్ ఆ ఇంట్లో కెమెరాలు ఉండటాన్ని గుర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏప్రిల్ 27న రాజేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రోజున కోర్టులో ప్రవేశపెట్టగా.. అక్కడి నుంచి 15 రోజులు జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే రాజేంద్రను విచారించగా అతను సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్ల బిజినెస్ చేస్తానని తెలిపినట్లు పోలీసులు తెలిపారు. అలాగే అతను ఐటీ నిపుణుడని.. స్పై కెమెరాలను ఎలా ఏర్పాటు చేయాలన్న విషయంపై అవగాహన ఉన్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..