Smoking in Aircraft: జైలుపాలు చేసిన బీడీ..! విమానంలోనే ధూమపానం.. అరెస్ట్ చేసి ప్రశ్నించగా, ఏమన్నాడంటే..?

Smoking in Aircraft: చాలా మంది నిబంధనలను అతిక్రమించి మరీ రైలులో ధూమపానం చేస్తుంటారు. అక్కడ ఏం కాలేదు, విమానంలో ఏమైనా అవుతుందా అన్నట్లుగా ఎయిర్‌క్రాఫ్ట్‌లో బీడీ తాగిన ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. మంగళవారం అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆకాశ ఎయిర్ విమానంలో..

Smoking in Aircraft: జైలుపాలు చేసిన బీడీ..! విమానంలోనే ధూమపానం.. అరెస్ట్ చేసి ప్రశ్నించగా, ఏమన్నాడంటే..?
Akasa Air Flight; Praveen Kumar

Updated on: May 18, 2023 | 5:50 AM

Smoking in Aircraft: చాలా మంది నిబంధనలను అతిక్రమించి మరీ రైలులో ధూమపానం చేస్తుంటారు. అక్కడ ఏం కాలేదు, విమానంలో ఏమైనా అవుతుందా అన్నట్లుగా ఎయిర్‌క్రాఫ్ట్‌లో బీడీ తాగిన ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. మంగళవారం అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆకాశ ఎయిర్ విమానంలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డారు. తొలిసారిగా విమానయానం చేస్తున్న ప్రవీణ్.. విమానంలోని టాయిలెట్‌లో పొగ తాగుతుండగా ఎయిర్‌లైన్ సిబ్బంది గుర్తించారు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజస్థాన్‌లోని మార్వార్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ పోలీసులతో తనకు ఇది మొట్టమొదటి విమానయానమని, విమానంలోని నిబంధనలు తనకు తెలియవని పేర్కొన్నాడు. అయితే 1937 ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ ప్రకారం విమానంలో ధూమపానం అనేది పూర్తిగా నిషేధం. ఈ కారణంగా ప్రవీణ్‌పై కేసు నమోదు చేసి, బెంగళూరు సెంట్రల్ జైలుకు పంపారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..