Vijay: విజయ్‌ బహిరంగ సభలో తుపాకీ కలకలం.. వేదిక దగ్గరకు వెళ్తుండగా..

అయితే.. పుదుచ్చేరిలో జరగనున్న విజయ్‌ బహిరంగ సభకు ఒక వ్యక్తి తుపాకీతో చొరబడేందుకు యత్నించడం కలకలం రేపింది.. తుపాకీతో వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని గమనించిన భద్రతా సిబ్బంది.. వెంటనే నిలువరించారు.. మెటల్‌ డిటెక్టర్‌ తనిఖీల్లో గుర్తించిన సిబ్బంది .. వెంటనే.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Vijay: విజయ్‌ బహిరంగ సభలో తుపాకీ కలకలం.. వేదిక దగ్గరకు వెళ్తుండగా..
Vijay

Updated on: Dec 09, 2025 | 12:43 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీవీకే అధినేత విజయ్ ప్రజాదరణ కోసం తన రాజకీయ ప్రచార షెడ్యూల్‌ను వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ పుదుచ్చేరిలోని ఉప్పలం గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే విజయ్‌ సమావేశానికి పుదుచ్చేరి ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. TVK పార్టీ మీటింగ్‌కు 5 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది.. ఇక ఈ మీటింగ్‌లో పుదుచ్చేరిలో భారీ మెజారిటీతో గెలుస్తామని టీవీకే అధినేత విజయ్‌ పేర్కొన్నారు. పుదుచ్చేరికి రాష్ట్ర స్థాయి హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పుదుచ్చేరి అభివృద్ధిని పట్టించుకోలేదని.. పుదుచ్చేరిలో భారీ మెజారిటీతో గెలుస్తామని విజయ్ పేర్కొన్నారు.

అయితే.. పుదుచ్చేరిలో జరగనున్న విజయ్‌ బహిరంగ సభకు ఒక వ్యక్తి తుపాకీతో చొరబడేందుకు యత్నించడం కలకలం రేపింది.. తుపాకీతో వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని గమనించిన భద్రతా సిబ్బంది.. వెంటనే నిలువరించారు.. మెటల్‌ డిటెక్టర్‌ తనిఖీల్లో గుర్తించిన సిబ్బంది .. వెంటనే.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ వ్యక్తిని పార్టీ శివగంగై జిల్లా కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్‌గా గుర్తించారు.

చాలా రోజుల తర్వాత తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌ తిరిగి ప్రజల్లోకి వస్తున్నారు.. కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన తర్వాత విజయ్ పాల్గొన్న తొలి బహిరంగ సభ ఇది .

ఈ నేపథ్యంలో.. కరూర్‌ ప్రచార సభలో జరిగిన తీవ్ర విషాదాన్ని దృష్టిలోపెట్టుకొని పుదుచ్చేరి పోలీసులు ఈ బహిరంగ సభకు కఠినమైన భద్రతను అమలుచేయడంతోపాటు.. ఆంక్షలు విధించారు. ఇతర రాష్ట్రాల వారు, పసిపిల్లలు, గర్భిణులు, వృద్ధులు రాకుండా నిషేధం విధించారు.