మోదీకి “జై” కొట్టిన దీదీ

"ఐకమత్యంగానే మాట్లాడదాం... ఐకమత్యంగా ఉందా... ఐకమత్యంగా పనిచేద్దాం..." మేము కేంద్ర ప్రభుత్వం వెంటే ఉంటామని మమత బెనర్జీ స్పష్టం చేశారు.

మోదీకి జై కొట్టిన దీదీ

Updated on: Jun 19, 2020 | 8:10 PM

ప్రదాని మోదీకి బెంగల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జై కొట్టారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిచారు. చైనాపై కేంద్రం తీసుకునే నిర్ణయాలకు తమ మద్ధతు ఉంటుందని తెలిపారు.  జింగ్‌పింగ్ నేతృత్వంలోని చైనాపై బెంగాల్ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదని, అక్కడ పూర్తి నియంతృత్వమే రాజ్యమేలుతోందని మండిపడ్డారు.

భారత్, చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను నేపథ్యంలో ప్రధాని మోదీ అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారు మనసులో ఏదుంటే అదే చేస్తారని చైనాపై నిప్పులు చెరిగారు.

మరోవైపు మనం కలిసి పనిచేయాలి. భారత్ గెలుస్తుంది. చైనా ఓడిపోతుంది. “ఐకమత్యంగానే మాట్లాడదాం… ఐకమత్యంగా ఉందా… ఐకమత్యంగా పనిచేద్దాం…” మేము కేంద్ర ప్రభుత్వం వెంటే ఉంటామని మమత బెనర్జీ స్పష్టం చేశారు.