ఐదు సంవత్సరాల్లో 5 లక్షల మంది యువతకు శిక్షణ.. కీలక ప్రకటనలు చేసిన మహీంద్రా గ్రూప్ సంస్థ..
ప్రముఖ పారిశ్రామిక సంస్థ మహీంద్రా గ్రూప్ కీలక ప్రకటనలు చేసింది. రాబోయే 5 సంవత్సరాలలో ఐదు లక్షల మంది యువతకు స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు మహీంద్రా గ్రూప్ సంస్థ గురువారం ప్రకటించారు.
ప్రముఖ పారిశ్రామిక సంస్థ మహీంద్రా గ్రూప్ కీలక ప్రకటనలు చేసింది. రాబోయే 5 సంవత్సరాలలో ఐదు లక్షల మంది యువతకు స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు మహీంద్రా గ్రూప్ సంస్థ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం సమాజంలోని బలహీన వర్గాల్లోని ప్రతిభావంతులను బయటకు తీసేందుకు మహీంద్రా ప్రైడ్ స్కూల్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అటు గత పదిహేను సంవత్సరాల్లో మహీంద్రా ప్రైడ్ స్కూల్స్ తరగతులలో ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణతోపాటు సుమారు లక్ష మందికి ఉద్యోగాలు కల్పించినట్లుగా ఆ సంస్థ ప్రకటించింది.
“గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా చెన్నై, పూణె, చండీగఢ్, శ్రీనగర్, పాట్నా, హైదరాబాద్, వారణాసి ప్రాంతాల్లో మహీంద్రా ప్రైడ్ స్కూల్ బ్రాంచులు ఉన్నాయి. దేశంలో కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు మహీంద్రా గ్రూప్ నాంది ఫౌండేషన్ సహకారంతో కరోనా తర్వాతి కాలానికి కావాల్సిన ఉద్యోగ నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తుందని వారు సుదీర్ఘ ప్రకటన చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు వ్యవసాయం, ఆరోగ్యం, ఈ కామర్స్ వంటి వాటికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వచ్చే సంవత్సరాల్లో ఉద్యోగాల నైపుణ్య శిక్షణను వేగవంతం చేస్తామన్నారు.
“మనదేశంలో ప్రస్తుతం ఉన్న జనాభా, వారి ఆర్థిక పరిస్థితులకు అనుసరించి ఉద్యోగాల కోసం వెళ్ళడం లేదు. ఈ ఎంపీఎస్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను రూపొందించాం. ఈ కార్యక్రమాల ద్వారా సరైన ఆదాయమార్గాన్ని కల్పించడమే మా సంస్థ లక్ష్యం” అని నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ అన్నారు.
One of our activities that makes me the most proud… https://t.co/olYW59ldUi
— anand mahindra (@anandmahindra) December 16, 2020