ఏకోపాధ్యాయ మామూలే.. ఏకోవిద్యార్ధి జర డిఫ్రెంట్.. ఆ ఊరికి ‘ఒకే ఒక్కడు’

|

Jan 23, 2023 | 6:12 PM

చదువు ప్రాముఖ్యతకు ఈ పాఠశాల బలమైన నిదర్శనం. ఎందుకంటే రోజు 10 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి ఒకేఒక్క విద్యార్ధి ఉన్న పాఠశాలకు వస్తున్నాడో టీచర్‌. చదువుతోపాటు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను..

ఏకోపాధ్యాయ మామూలే.. ఏకోవిద్యార్ధి జర డిఫ్రెంట్.. ఆ ఊరికి ఒకే ఒక్కడు
Maharashtra News
Follow us on

చదువు ప్రాముఖ్యతకు ఈ పాఠశాల బలమైన నిదర్శనం. ఎందుకంటే రోజు 10 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి ఒకేఒక్క విద్యార్ధి ఉన్న పాఠశాలకు వస్తున్నాడో టీచర్‌. చదువుతోపాటు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను విద్యార్ధికి అందేలా చూస్తున్నాడు. ఈ ఏకోపాధ్యాయ.. ఏకోవిద్యార్ధి పాఠశాల ఎక్కడుందంటే..

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా గణేష్‌పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత రెండేళ్లుగా కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే స్కూల్‌కు వస్తున్నాడు. ఆ ఒక్క విద్యార్ధికి కిషోర్‌ మాన్కర్ అనే టీచర్‌ పాఠాలు చెబుతున్నాడు. కిషోర్‌ మాన్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ గ్రామం మొత్తం జనాభా కేవలం 150 మాత్రమే. 1 నుంచి నాలుగో తరగతి వరకు మాత్రమే పాఠశాలలో తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఉంది. గ్రామం మొత్తంలో పాఠశాలకు వెళ్లే వయస్సున్న పిల్లల్లో ఒకేఒక అబ్బాయి ఉన్నాడు. ఆ విద్యార్ధికి నేను అన్ని సబ్జెక్టులను బోధిస్తాను. చదువు మాత్రమే కాకుండా మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నాం. అలాగే ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు విద్యార్ధికి అందిస్తున్నట్లు మీడియాకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.