నో స్టాక్ ప్లీజ్ ! 18-44 ఏళ్ళ మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్ నిలిపివేసిన మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి అందితేనే వారికి ఆ సౌకర్యం

| Edited By: Phani CH

May 11, 2021 | 5:14 PM

కోవిడ్ వ్యాక్సిన్ డోసుల కొరత కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం 18-44 ఏళ్ళ మధ్య వయస్సు వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది. 3 లక్షల కోవాగ్జిన్ టీకా మందును ఇక 45, అంతకన్నా వయస్సు పైబడినవారికి మళ్లిస్తున్నామని ప్రకటించింది.

నో స్టాక్ ప్లీజ్ ! 18-44 ఏళ్ళ మధ్య వయస్కులకు  వ్యాక్సినేషన్ నిలిపివేసిన మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి అందితేనే వారికి ఆ సౌకర్యం
Maharashtra Halts Covid Jab For 14 44 Age
Follow us on

కోవిడ్ వ్యాక్సిన్ డోసుల కొరత కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం 18-44 ఏళ్ళ మధ్య వయస్సు వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది. 3 లక్షల కోవాగ్జిన్ టీకా మందును ఇక 45, అంతకన్నా వయస్సు పైబడినవారికి మళ్లిస్తున్నామని ప్రకటించింది. వీరంతా రెండో డోసు తీసుకోవలసి ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోప్ తెలిపారు. ఇలా సెకండ్ డోసు తీసుకోవలసిన ప్రజలు దాదాపు 5 లక్షల మంది ఉన్నారని ఆయన చెప్పారు. 18 ఏళ్ళు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వడాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాం..కేంద్రం నుంచి అదనంగా టీకా మందు అందిన పక్షంలో అప్పుడు వీరికి కూడా ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం అని ఆయన చెప్పారు. నిర్దిష్ట వ్యవధిలో రెండో డోసు తీసుకోని పక్షంలో వ్యాక్సిన్ సామర్థ్య ప్రభావం దానిపై పడుతుందని, అందువల్ల ప్రభుత్వం ఈ మూడు లక్షల డోసుల వ్యాక్సిన్ ని 45 ఏళ్ళు, అంతకన్నా వయస్సు పైబడినవారికి ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. లిబరలైజ్డ్ ప్రైసింగ్ విధానం కింద ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఉచితంగా చేపడుతున్నారు. అయితే రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు 18 నుంచి 44 ఏళ్ళ మధ్య వయస్సువారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు 50 శాతం టీకామందును ప్రొక్యూర్ చేసుకోవలసి ఉంటుంది.

మహారాష్ట్రకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ యాప్ ను కేటాయించాలని రాజేష్ టోప్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యలు చాలా ఉన్నాయని, నగర ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సిన్లు తీసుకుంటున్నారని అందువల్ల మా రాష్ట్రానికి ప్రత్యేక యాప్ ఉండాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఇక మ్యుకోర్ మైకోసిస్ గురించి ప్రస్తావిస్తూ ఆయన.. దీనికి మల్టీ ట్రీట్ మెంట్ అవసరమని అన్నారు. కొన్ని ప్రత్యేక ఆసుపత్రుల్లో మాత్రం దీని చికిత్సకు అవసరమైన సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:Telangana Medical Recruitment: క‌రోనా వేళ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. భారీ సంఖ్య‌లో వైద్య ఉద్యోగుల‌ భ‌ర్తీ..

శ్రీలంక టూర్‌ కోసం 24 మంది సభ్యులతో జట్టు ఎంపిక.. కానీ పేర్లు వెల్లడించని బీసీసీఐ..