Disa Case: సుశాంత్‌సింగ్‌ మాజీ మేనేజర్‌ దిశా డెత్‌ కేసు.. సంచలన ఆరోపణలు చేసిన మహా సర్కార్..

|

Dec 23, 2022 | 5:49 AM

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియాన్‌ డెత్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దిశా సలియాన్‌ డెత్‌ అంశం మహారాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది.

Disa Case: సుశాంత్‌సింగ్‌ మాజీ మేనేజర్‌ దిశా డెత్‌ కేసు.. సంచలన ఆరోపణలు చేసిన మహా సర్కార్..
Devendra Fadnavis
Follow us on

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియాన్‌ డెత్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దిశా సలియాన్‌ డెత్‌ అంశం మహారాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. దిశా మరణానికి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్యా ఠాక్రేకి సంబంధం ఉందంటూ బీజేపీ, షిండే వర్గం ఆరోపించింది. దాంతో మహారాష్ట్ర అసెంబ్లీ దద్దరిల్లింది. కేవలం, ఆరోపణలు చేయడమే కాదు.. ఆదిత్యా ఠాక్రేకి నార్కో టెస్ట్‌ చేయాలంటూ అధికారపక్షం పట్టుబట్టింది. దాంతో అసెంబ్లీలో పెద్ద రచ్చ జరిగింది. బీజేపీ అండ్‌ షిండే వర్గం ఆరోపణలపై ఠాక్రే వర్గం ఎదురు దాడికి దిగడంతో స్ట్రీట్‌ ఫైట్‌ని తలపించింది అసెంబ్లీ.

చివరికి, దిశా సలియాన్‌ డెత్‌పై సిట్‌ దర్యాప్తు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌. దిశ డెత్‌కి సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే పోలీసులకు అందించవచ్చన్నారు ఫడ్నవిస్‌. ఎవర్నీ లక్ష్యం చేసుకోకుండా నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని ప్రకటించారు. 2020 జూన్‌ 8న దిశా సలియాన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించింది. భవనం పైనుంచి పడి చనిపోయింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ మరణానికి 5రోజుల ముందు ఇది జరిగింది.

కాగా, దిశ మరణించిన 5రోజులకే సుశాంత్‌ సూసైడ్‌ చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, ఇద్దరి మృతి వెనక ఆదిత్య ఠాక్రే హస్తం ఉందంటూ ఆరోపణలు వచ్చాయ్‌. ఇప్పుడు, ఈ కేసును తిరగదోడటంతో ఆదిత్య ఠాక్రేకి ఉచ్చు బిగుస్తుందనే ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..