Maha Kumbh Mela: వైభవంగా మహా కుంభమేళా.. ఒక్క రోజే 10 లక్షలకుపైగా భక్తుల పుణ్య స్నానం!
Maha Kumbh Mela: ఘాట్లకు వెళ్లే మార్గాలన్నింట్లో వాహనాల రాకపోకలను నిషేధించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు కూడా నగరం బయటే నిలిపివేయాల్సి ఉంటుంది. రెండ్రోజులుగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రహదారులు వాహనాలతో కిటకిటలాడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా, అనేక ప్రాంతాల్లో ప్రజలు..

మహా కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. భక్తులు గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తోన్నారు. నేడు మాఘ పౌర్ణమి. ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరించడానికి లక్షల సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్‌కు చేరుకుంటున్నారు. వివిధ అఖాడాకు చెందన సాధవులు, అఘోరీలు అమృత్ స్నానం చేయనున్నారు. ఈ ఒక్క రోజే 10 లక్షలకు పైగా భక్తులు పుణ్య స్నానం చేసే అవకాశముందని ప్రభుత్వ అంచనా ఇప్పటివరకు 45 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించినట్లు ప్రభుత్వం చెప్పింది.
జనవరి 13న ప్రారంభమైన కల్పవాస కాలం ముగింపును సూచించే ‘‘మాఘ పూర్ణిమ’’ పవిత్ర స్నానానికి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్‌రాజ్, త్రివేణి సంగమం ఘాట్లన్నింటినీ నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం.
ఘాట్లకు వెళ్లే మార్గాలన్నింట్లో వాహనాల రాకపోకలను నిషేధించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు కూడా నగరం బయటే నిలిపివేయాల్సి ఉంటుంది. రెండ్రోజులుగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రహదారులు వాహనాలతో కిటకిటలాడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా, అనేక ప్రాంతాల్లో ప్రజలు 30 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోయారు. సరిగ్గా ఈ సమయంలోనే మాఘ పౌర్ణమి స్నానాలు రావడంతో మాహ కుంభమేళాకు యాత్రికుల తాకిడి, ట్రాఫిక్ జామ్ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మహా కుంభ్ ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




