- Telugu News India News Bengaluru's Aero India 2025: Union Minister Rammohan Naidu Flew In Fighter Jet
Aero India 2025: పైలట్ రామ్.. యశస్ యుద్ధ విమానం నడిపిన కేంద్రమంత్రి.. ఇవిగో ఆ ఫోటోలు వైరల్
బెంగళూరులో ఆసియా బిగ్గెస్ట్ ఎయిర్ షో అదుర్స్ అనేలా జరుగుతోంది. ఆకాశమే హద్దుగా విమానాలు దూసుకుపోతున్నాయి. బెంగళూరులో ఆసియా బిగ్గెస్ట్ ఎయిర్ షో అదుర్స్ అనేలా జరుగుతోంది. యుద్ధ విమానాలు రెక్కలు విప్పి రివ్వుమంటూ ఎగిరిపోతున్నాయి. ఆకాశపు అంచులను తాకి విన్యాసాలు చేస్తున్నాయి. రెండేళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ షోకి వేదికైంది బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్. ఇవాల్టి నుంచి ఈ నెల 14వరకు జరగనుందీ ఎయిర్ షో. - ది రన్‌వే టు ఎ బిలియన్ ఆపర్చునిటీస్ అనే థీమ్‌తో జరుగుతోంది ఎయిర్ షో.
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu | Edited By: Jyothi Gadda
Updated on: Feb 12, 2025 | 8:45 AM

ప్రపంచదేశాల యుద్దవిమానాలు, ఈ షోలో పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి ఇండియా, రష్యా, అమెరికాపైనే ఉంది. ఈసారి అప్‌డేటెడ్ టెక్నాలజీతో అద్భుత ప్రదర్శన ఇచ్చేందుకు రష్యా ఉవ్విళ్లూరుతోంది. రష్యా రూపొందించిన SU-57, అలాగే అమెరికాకు చెందిన F-35 విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. మన దేశానికి, తమతమ అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్లను అమ్మేందుకు అమెరికా, రష్యా పోటీ పడుతున్నాయి. ఈ ప్రదర్శనలో 90 వరకు దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఈ ఎయిర్ షోలో రష్యా తన అత్యంత పవర్‌ఫుల్ సుఖోయ్..SU-57యుద్ధ విమానాన్ని ప్రదర్శించింది. ఇది ఆకాశంలో విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ఇది రష్యాకు చెందిన అత్యంత ఆధునిక ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్. ఇక అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్టెల్త్ ఫైటర్ జెట్ F-35 లైట్‌నింగ్-2. పేరుకు తగ్గట్లే ఇది టార్గెట్లపై మెరుపు వేగంతో దాడి చేస్తుంది. ఇది రష్యా తయారు చేసిన SU-57 కంటే మెరుగైన యుద్ధ విమానం అని చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు.

ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా-2025 ఎగ్జిబిషన్‌లో ఈసారి హైదరాబాద్‌కు చెందిన రక్షణ రంగ కంపెనీ వెమ్ టెక్నాలజీస్ సత్తా చాటుతోంది. డీఆర్డీవోతో కలిసి వెమ్ టెక్నాలజీస్ తయారుచేసిన అత్యాధునిక అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్...AMCA యుద్ధ విమానాన్ని దేశం ముందుకు తీసుకొచ్చింది. వెమ్ టెక్నాలజీస్ ‘ఏఎంసీఏ’ యుద్ధ విమానంలోని కీలక మాడ్యూల్స్‌ను తయారు చేయడమే కాకుండా పూర్తి విమానాన్ని హైదరాబాద్‌లోనే అసెంబుల్ చేసింది. యుద్ధ విమానాల ఫ్యుసిలేజ్‌లు,జనరేటర్ల తయారీలో వెమ్ టెక్నాలజీస్ పేరు గాంచింది. రక్షణ రంగ విమానాలు, హెలికాప్టర్లకు అవసరమైన ఆన్ బోర్డ్ సిస్టమ్‌లను కూడా వెమ్ తయారు చేస్తోంది.

కేంద్ర రక్షణశాఖ ఈ ఎయిర్ షోని 1996 నుంచి రెండు సంవత్సరాలకోసారి నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటివరకు 14సార్లు ఎయిర్ షోలు జరగ్గా... ఇది 15వ ఎయిర్‌షో. అలాగే ప్రతీసారి బెంగళూరే ఎయిర్‌షోకి అతిథ్యమిస్తూ వస్తోంది. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది కేంద్రం. ఎయిర్ షో చూసేందుకు పలురాష్ట్రాల నుంచి బెంగళూరు వస్తుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఏరో ఇండియా-2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపడం.. మరచిపోలేని అనుభూతినిచ్చింది. హెచ్ఏఎల్ స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటీ-36 'యశస్' అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించింది. విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనం. ప్రధాని నరేంద్రమోదీ గారి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు.





























