రజనీకాంత్‌పై మద్రాస్‌ హైకోర్టు సీరియస్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురించి చాలా మంది గొప్పగా చెబితే విన్నాం! అంత ఉదారస్వభావుడు ఆరున్నర లక్షల రూపాయల కోసం హైకోర్టుతో అక్షింతలు వేయించుకుంటారని మాత్రం అనుకోలేదు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఊరుకునేది లేదని గట్టిగానే తిట్టిపోసింది హైకోర్టు.. పైగా ఇట్లాంటి పనులు చేస్తే జరిమానా విధించాల్సి ఉంటుంది జాగ్రత్త అంటూ హెచ్చరించింది.. చెన్నైలోని కోడంబాకంలో రజనీకాంత్‌కు రాఘవేంద్ర కల్యాణమండపం ఉంది.. కల్యాణమండపం అన్న తర్వాత ప్రాపర్టీ టాక్స్‌ కట్టాలిగా! ఆయనేమో కట్టలేదు.. ఇందుకు […]

రజనీకాంత్‌పై మద్రాస్‌ హైకోర్టు సీరియస్‌
Follow us
Balu

|

Updated on: Oct 14, 2020 | 3:37 PM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురించి చాలా మంది గొప్పగా చెబితే విన్నాం! అంత ఉదారస్వభావుడు ఆరున్నర లక్షల రూపాయల కోసం హైకోర్టుతో అక్షింతలు వేయించుకుంటారని మాత్రం అనుకోలేదు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఊరుకునేది లేదని గట్టిగానే తిట్టిపోసింది హైకోర్టు.. పైగా ఇట్లాంటి పనులు చేస్తే జరిమానా విధించాల్సి ఉంటుంది జాగ్రత్త అంటూ హెచ్చరించింది.. చెన్నైలోని కోడంబాకంలో రజనీకాంత్‌కు రాఘవేంద్ర కల్యాణమండపం ఉంది.. కల్యాణమండపం అన్న తర్వాత ప్రాపర్టీ టాక్స్‌ కట్టాలిగా! ఆయనేమో కట్టలేదు.. ఇందుకు సంబంధించి ఆరున్నర లక్షల రూపాయల ఆస్తిపన్నును చెల్లించాల్సి ఉందని రజనీకాంత్‌కు ఓ నోటీసును పంపింది గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌! కట్టేస్తే పోయేది కానీ రజనీకాంత్‌ మద్రాస్‌ హైకోర్టుకెళ్లారు.. లాక్‌డౌన్‌ కారణంగా కల్యాణమండపాన్ని క్లోజ్‌ చేసి ఉంచామని, ఆ కారణంగా కల్యాణమండపం ద్వారా తమకు ఎలాంటి ఆదాయమూ రాలేదని కోర్టుకు విన్నవించుకున్నారు. అంచేత ఆ పన్ను చెల్లించడం తన వల్ల కాదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ అనిత సుమంత్‌కు కోపం వచ్చింది.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఇలా ఎగ్గొట్టేందుకు సాకులు చెబితే ఎలా అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలపై కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోర్టు అంత సీరియస్‌ అవ్వడంతో కేసును విత్‌డ్రా చేసుకోడానికి కొంత టైమ్‌ ఇవ్వాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు రజనీకాంత్‌ తరఫు న్యాయవాది…!