నిర్వీర్యం చేస్తుండగా పేలిన రెండో ప్రపంచ యుద్ధపు అతి పెద్ద బాంబు

రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన రెండు భారీ బాంబులు నీటిలో పేలాయి. వీటిని పోలాండ్‌లో గుర్తించిన నేవీ డైవర్లు, స్వినోజ్‌సై ప్రాంతంలోని పియాస్ట్‌

నిర్వీర్యం చేస్తుండగా పేలిన రెండో ప్రపంచ యుద్ధపు అతి పెద్ద బాంబు
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2020 | 4:34 PM

World War two bomb: రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన రెండు భారీ బాంబు నీటిలో పేలాయి. దీన్ని పోలాండ్‌లో గుర్తించిన నేవీ డైవర్లు, స్వినోజ్‌సై ప్రాంతంలోని పియాస్ట్‌ కాలువలోకి తీసుకెళ్లి మంగళవారం నిర్వీర్యం చేస్తుండగా.. అది పేలిపోయింది. దీన్ని నిర్వీర్యం చేసే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న 750 మందిని అక్కడి నుంచి తరలించారు. 2,400 కేజీల పేలుడు పదార్థంతో సహా ఈ బాంబు బరువు బరువు 5,400 కిలోలు ఉందని అధికారులు తెలిపారు.

”నిర్వీర్యం కాస్త పేలుడుగా మారింది. దీంతో ఇకపై ఎలాంటి ముప్పు ఉండదు” అక్కడి ఓ అధికారి తెలిపారు. డేంజర్ జోన్‌కి దూరంగా మైన్ డైవర్ ఉండి ఈ ప్రక్రియ చేశారని అన్నారు. ఇక ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గానీ ఆస్తినష్టం గానీ జరగలేదని స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్దం జరిగే సమయంలో 1945లో జర్మన్‌ క్రూయిజర్ లుట్జోపై బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్ ఈ బాంబులను వేసింది.

Read More:

ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టిన సమంత..!

నానితో అనుపమ రెండోసారి రొమాన్స్‌..!