మంత్రిగారు గైర్ హాజర్, రైతు సంఘాల నిరసన, చట్ట కాపీల చించివేత
ఢిల్లీలో బుధవారం ఓ విచిత్ర ఘటన జరిగింది. రైతు చట్టాలపై చర్చకుగాను కేంద్ర మంత్రితో సమావేశమయ్యేందుకు 30 రైతు సంఘాల ప్రతినిధులు ఈ ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కార్యాలయానికి చేరుకున్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఈ మీటింగ్ కి హాజరైనప్పటికీ.. స్వయంగా తోమరే వఛ్చి సమావేశంలో పాల్గొనాలంటూ వారు డిమాండ్ చేశారు. కానీ ఎంతసేపటికీ ఆయన రాకపోయేసరికి వారిలో సహనం నశించి అక్కడే నినాదాలు చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా తమ […]
ఢిల్లీలో బుధవారం ఓ విచిత్ర ఘటన జరిగింది. రైతు చట్టాలపై చర్చకుగాను కేంద్ర మంత్రితో సమావేశమయ్యేందుకు 30 రైతు సంఘాల ప్రతినిధులు ఈ ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కార్యాలయానికి చేరుకున్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఈ మీటింగ్ కి హాజరైనప్పటికీ.. స్వయంగా తోమరే వఛ్చి సమావేశంలో పాల్గొనాలంటూ వారు డిమాండ్ చేశారు. కానీ ఎంతసేపటికీ ఆయన రాకపోయేసరికి వారిలో సహనం నశించి అక్కడే నినాదాలు చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. ఈ చట్టాల తాలూకు కాపీలను చించివేశారు. భారతీయ కిసాన్ యూనియన్ తరఫున ముగ్గురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.