Madras High Court: తాళం వేసిన గదిలో ఆడ, మగ ఉంటే ఎలాంటి తప్పులేదు: మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

Madras High Court Judgement: ఓ కేసును విచారించిన మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. తాళం వేసిన గదిలో అవివాహితులైన ఆడ, మగ ఉంటే ఎలాంటి నేరం కాదని తీర్పు...

Madras High Court: తాళం వేసిన గదిలో ఆడ, మగ ఉంటే ఎలాంటి తప్పులేదు: మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 06, 2021 | 12:00 PM

Madras High Court Judgement: ఓ కేసును విచారించిన మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. తాళం వేసిన గదిలో అవివాహితులైన ఆడ, మగ ఉంటే ఎలాంటి నేరం కాదని తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైలో 1998లో సాయుధ దళంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శరవణబాబు ఇంటిలో అదే ప్రాంతానికి చెందిన మహిళా కానిస్టేబుల్‌ ఉన్నప్పుడు స్థానికులు ఆ ఇద్దరు ఏదో తప్పిదాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఆ గదికి తాళం వేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఆ ఇంటి కెళ్లి తాళం తీశారు. లోపలికి వెళ్లి పరిశీలించగా, శరవణబాబు, మహిళా కానిస్టేబుల్‌ ఉన్నారు.

ఈ సంఘటనపై విచారణ జరిపిన అనంతరం శరవణబాబుకు మహిళా కానిస్టేబుల్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు పరిగణించి ఆయనను సస్పెండ్‌ చేశారు. ఈ ఉత్తర్వును సవాల్‌ చేస్తూ శరవణబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై 23 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. హైకోర్టు న్యాయమూర్తి సురేష్‌ కుమార్‌ ఇరు పక్షాల వాదప్రతివాదనల తర్వాత శుక్రవారం తీర్పు వెలువరించింది. మహిళా కానిస్టేబుల్‌ తప్పు చేయాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్‌ శరవణబాబు ఇంటి లోపలకు వెళ్లినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, అవివాహితులైన ఆడ, మగ ఓ గదిలో ఉంటే తప్పుగా భావించే అవకాశం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే సస్పెండ్‌ చేసిన శరవణబాబును మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. తాళం వేసిన గదిలో ఓ ఆడ, మగ ఉంటే ఆ చోట వ్యభిచారం జరిగినట్లు భావించలేమని, సమాజంలో పలు అభిప్రాయాలు ఉన్నంతమాత్రన వాటి ఆధారంగా క్రమ శిక్షణారాహిత్య చర్యలు తీసుకోవడమో, లేక శిక్షించడమే భావ్యం కాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

Also Read: Thieves Gang: 300లపైగా కేసులున్న దొంగల ముఠా అరెస్టు.. వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్‌

రేపటి నుంచే భారత్-ఆసీసీ ఐదో టెస్టు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రేపటి నుంచే భారత్-ఆసీసీ ఐదో టెస్టు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తక్కువ ధరలో అదిరే ఫీచర్లు.. పది లక్షల్లోపు బెస్ట్‌ కార్లు ఇవే..!
తక్కువ ధరలో అదిరే ఫీచర్లు.. పది లక్షల్లోపు బెస్ట్‌ కార్లు ఇవే..!
అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
పుష్ప స్టైల్‌లో క్రికెట్ ఆడిన వినోద్ కాంబ్లీ.. వీడియో
పుష్ప స్టైల్‌లో క్రికెట్ ఆడిన వినోద్ కాంబ్లీ.. వీడియో
మహిళలపై శుక్రుడు కనక వర్షం.. ఆ రాశుల వారికి అపార ధన లాభాలు
మహిళలపై శుక్రుడు కనక వర్షం.. ఆ రాశుల వారికి అపార ధన లాభాలు
వాలంటీర్లపై కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..?
వాలంటీర్లపై కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..?
వివాదాలకు కేరాఫ్‌గా మారిన సెంట్రల్ జైలు
వివాదాలకు కేరాఫ్‌గా మారిన సెంట్రల్ జైలు
సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఈ ఒక్క పని చేయండి చాలు..
సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఈ ఒక్క పని చేయండి చాలు..
'అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తు కొచ్చారు'.. జానీ మాస్టర్
'అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తు కొచ్చారు'.. జానీ మాస్టర్
వోక్స్‌వ్యాగన్ కారులో 5వేల ఏండ్ల పురాతన ఆలయానికి..
వోక్స్‌వ్యాగన్ కారులో 5వేల ఏండ్ల పురాతన ఆలయానికి..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!