Chakka Jam: ‘చక్కా జామ్’ అలర్ట్… దేశ రాజధానిలో పలు మెట్రో స్టేషన్ల మూసివేత.. డ్రోన్లతో పర్యవేక్షణ
Farmers protest - Chakka Jam: రైతుల చక్కా జామ్ ఆందోళన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో చక్కా జామ్ నిర్వహించడం లేదని రైతు సంఘం నేతలు..
Farmers protest – Chakka Jam: రైతుల చక్కా జామ్ ఆందోళన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో చక్కా జామ్ నిర్వహించడం లేదని రైతు సంఘం నేతలు పేర్కొన్నప్పటికీ ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. లాల్ ఖిలా, జామా మసీద్, జన్‌పథ్, సెంట్రల్ సెక్రటెరియేట్, విశ్వవిద్యాలయ స్టేషన్, మండీ హౌస్, ఐటీవో, ఢిల్లీ గేట్, ఖాన్ మార్కెట్, నేహ్రూ ప్లేస్ స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) శనివారం ఉదయం వెల్లడించింది.
చక్కా జామ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో సింఘు, ఘాజీపూర్, టిక్రీ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బారికేడ్లను ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా పరిస్థిని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: