ఇండియాలో రైతుల ఆందోళన, ఐరాస మానవ హక్కుల సంఘం జోక్యం, సంయమనం మేలని సూచన
ఇండియాలో వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులు, మరోవైపు భారత ప్రభుత్వం కూడా సంయమనంతో వ్యవహరించాలని...
ఇండియాలో వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులు, మరోవైపు భారత ప్రభుత్వం కూడా సంయమనంతో వ్యవహరించాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం సూచించింది. అధికారులు, అన్నదాతలు సాధ్యమైనంత వరకు నిగ్రహంతో వ్యవహరించాలని, రైతులు శాంతియుతంగా నిరసన తెలపాలని ఈ సంస్థ ట్వీట్ చేసింది. మానవ హక్కులను గౌరవించే విధంగా రెండు పక్షాలూ ఇలా ప్రవర్తించాలని కోరింది. భారత్ లో రైతుల ఆందోళనపై పాప్ సింగర్ రిహానా, క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బెర్గ్ తదితరులతో సహా పలువురు అంతర్జాతీయ సెలబ్రెటీలు అన్నదాతల ఆందోళనకు మద్దతునిస్తూ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే ఐరాస మానవ హక్కుల సంఘం ఈ సూచన చేయడం విశేషం.
అయితే ఇది తమ ఆంతరంగిక వ్యవహారమని, మా అంతర్గత అంశాల్లో ఇతర దేశాలు, లేదా ఇతరులు జోక్యం చేసుకోజాలరని భారత ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. మా సార్వభౌమాధికారంపై ఇతరులెవరూ దాడి చేయరాదని పేర్కొంది. కాగా శనివారం ఇండియాలో కొన్ని జిల్లాలు మినహా దేశవ్యాప్తంగా రైతులు చక్కా జామ్ ఆందోళన నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలవరకు అన్ని హైవేలను వారు నిర్బంధించనున్నారు. కానీ ఢిల్లీ, యూపీ, ఉత్తర[ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఆందోళన నిర్వహించ రాదని రైతు సంఘాలు కోరాయి. ఇప్పటికే ఢిల్లీ ఎర్రకోట వద్ద గత నెల 26 న గణ తంత్ర దినోత్సవం రోజున హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి విదితమే.
#India: We call on the authorities and protesters to exercise maximum restraint in ongoing #FarmersProtests. The rights to peaceful assembly & expression should be protected both offline & online. It’s crucial to find equitable solutions with due respect to #HumanRights for all.
— UN Human Rights (@UNHumanRights) February 5, 2021
Read More: హర్యానాలో ‘రణక్షేత్రం’ ! వేలాది రైతులపై పోలీసుల బాష్పవాయు ప్రయోగం, బ్యారికేడ్ల ధ్వంసం.
Read More: ‘ఛలో ఢిల్లీ’ రైతు ఉద్యమంలో విషాదం… కారులోనే సజీవ దహనమైన రైతు..