హర్యానాలో ‘రణక్షేత్రం’ ! వేలాది రైతులపై పోలీసుల బాష్పవాయు ప్రయోగం, బ్యారికేడ్ల ధ్వంసం

రైతు చట్టాలకు నిరసనగా పంజాబ్, హర్యానా రైతుల ఆందోళన ఉధృతమవుతోంది. ట్రాక్టర్లపైనా, కాలినడకన వేలాది రైతులు గురువారం ఉదయం హర్యానా సరిహద్దులకు చేరుకున్నారు.

హర్యానాలో 'రణక్షేత్రం' ! వేలాది  రైతులపై పోలీసుల బాష్పవాయు ప్రయోగం, బ్యారికేడ్ల ధ్వంసం
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Nov 26, 2020 | 11:47 AM

రైతు చట్టాలకు నిరసనగా పంజాబ్, హర్యానా రైతుల ఆందోళన ఉధృతమవుతోంది. ట్రాక్టర్లపైనా, కాలినడకన వేలాది రైతులు గురువారం ఉదయం హర్యానా సరిహద్దులకు చేరుకున్నారు. వారిని అడ్డగించేందుకు పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ రైతులు వాటిని విరిచి దగ్గరలోని నదిలో విసిరేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు మొదట వాటర్ క్యానన్లను, అనంతరం బాష్పవాయువును ప్రయోగించారు. యూపీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్, కేరళ రాష్ట్రాలకు చెందిన రైతులంతా చలో ఢిల్లీ పేరిట భారీ మార్చ్ తలపెట్టారు. సుమారు రెండు లక్షల మంది అన్నదాతలు ఆందోళన చేస్తునట్టు వివిధ రైతు సంఘాలు ప్రకటించాయి.

అయితే ఢిల్లీ మార్చ్ కు వీరంతా బయలుదేరినప్పటికీ అక్కడ వీరికి అనుమతి లభించబోదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా వైరస్ ప్రబలంగా ఉందని, వీరి ఆందోళన ఫలితంగా ఇది మరింత విజృంభిస్తుందని వారు పేర్కొన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తామని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని వారు హెచ్చరించారు.  ముందు జాగ్రత్త చర్యగా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.