రేణిగుంట సమీపంలోని వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు… సహాయక చర్యలు చేపట్టిన రిస్క్యూ టీం..

పొలంలో మోటార్ కోసం వెళ్లి ముగ్గురు రైతులు వాగులో చిక్కుకున్నారు. మల్లెమడుగు రిజర్వాయర్ నిండిపోవడంతో నీటి ఉధృతి పెరిగి ప్రాణాపాయ స్థితిలో పడ్డారు.

రేణిగుంట సమీపంలోని వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు...  సహాయక చర్యలు చేపట్టిన రిస్క్యూ టీం..
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 26, 2020 | 11:43 AM

పొలంలో మోటార్ కోసం వెళ్లి ముగ్గురు రైతులు వాగులో చిక్కుకున్నారు. మల్లెమడుగు రిజర్వాయర్ నిండిపోవడంతో నీటి ఉధృతి పెరిగి ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. ఏర్పేడు మండలం డిక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఇక నివర్‌ తుపాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

రేణిగుంటఎయిర్ పోర్ట్ సమీపంలో కుమ్మరితోపు చెరువులో చెట్టును పట్టుకుని వేళాడుతున్న ముగ్గురు రైతులు వెంకటేశ్, ప్రసాద్, లోకేష్.. మోటార్ కోసం పొలానికి వెళ్లివస్తూ చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వచ్చిన వరదనీటితో కొట్టుకుపోయిన ముగ్గురు చెట్టుకు పట్టుకుని వేలాడుతూ ప్రాణాలను కాపాడుకున్నారు. దీంతో రేణిగుంట డీఎస్పీ, సీఐ సహా ఇతర అధికారులు వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రప్పించి లేదా హెలికాప్టర్ సాయంతో రైతులను బయటకు తీసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మరోవైపు, మల్లెమడుగు రిజర్వాయర్ నిండిపోవడంతో నీటి ఉధృతి పెరిగింది. అయితే, బాధితులను కాపాడటం కష్టతరం కావొచ్చని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు తమ వారిని రక్షించాలంటూ కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!