బెంగాల్ బ్యాటిల్, బీజేపీ యాత్రకు అనుమతి, నో, జేపీ నడ్డా నేతృత్వాన మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాం

బెంగాల్ లో బీజేపీ రథయాత్రపై సస్పెన్స్ నెలకొంది. మొదట దీనిపై  పలు అనుమానాలు తలెత్తాయి. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వాన శనివారం  ఈ యాత్రకు అనుమతి...

బెంగాల్ బ్యాటిల్, బీజేపీ యాత్రకు  అనుమతి,  నో, జేపీ నడ్డా నేతృత్వాన మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాం
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 06, 2021 | 11:01 AM

బెంగాల్ లో బీజేపీ రథయాత్రపై సస్పెన్స్ నెలకొంది. మొదట దీనిపై  పలు అనుమానాలు తలెత్తాయి. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వాన శనివారం  ఈ యాత్రకు అనుమతి  లభించే సూచనలు ఉన్నాయని వార్తలు వచ్చాయి దీన్ని పరివర్తన్ యాత్ర అని ఓ వైపు బీజేపీ వ్యవహరిస్తుండగా మీడియా మాత్రం  రథయాత్ర అంటోందని ఈ పార్టీ పేర్కొంటోంది. శాంతిభ్రదతల దృష్ట్యా ఈ యాత్రకు అనుమతినివ్వరాదని  కలకత్తా హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. తాము మొత్తం 5 పరివర్తన యాత్రలను చేపడతామని ఈ పార్టీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి రాసిన లేఖలో తెలిపింది. ఇందుకు అనుమతించాలని కోరింది. దేశానికి స్వాతంత్య్రం వఛ్చినప్పటినుంచి పలు రాజకీయపార్టీలు పాదయాత్రలు, రథయాత్రలు చేపట్టిన విషయాన్ని కమలం పార్టీ గుర్తు చేసింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం గానీ, మతం పేరునగానీ తాము ఈ కార్యక్రమం చేపట్టడంలేదని, కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలను విముక్తులను చేసి మార్పు కోసమే ఈ ప్రోగ్రాం చేపట్టామని బీజేపీ నేత శామిక్ భట్టాచార్య తెలిపారు.

అయితే జేపీ నడ్డా చేపట్టే బహిరంగ సభకు అనుమతి లభించిందని, కానీ రథయాత్రకు అనుమతిలేదని పోలీసువర్గాలు తెలిపాయి. మొత్తానికి నాడియా జిల్లాలోని నవద్వీప్ నుంచి యాత్రకు ప్రభుత్వం అనుమతించింది.

మరిన్ని చదవండి:LIC Policy Holders: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. త్వరలో రానున్న ఎల్‌ఐసీ ఐపీవో వీళ్లకే ప్రాధాన్యత

మరిన్ని చదవండి:  Chakka Jam: ఢిల్లీలో ‘చక్కా జామ్’ టెన్షన్.. వేలాది మంది పోలీసులతో భారీ భద్రత..