తాత్కాలిక ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన..

ప్రస్తూతి ప్రయోజనాలను మంజూరు చేసే విషయంలో రెగ్యూలర్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మధ్య తేడా ఉండకూడదని మాద్రాసు హైకోర్టు భావించింది.

తాత్కాలిక ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన..
Madras High Court
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 21, 2021 | 3:15 PM

ప్రస్తూతి ప్రయోజనాలను మంజూరు చేసే విషయంలో రెగ్యూలర్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మధ్య తేడా ఉండకూడదని మాద్రాసు హైకోర్టు భావించింది. ఈ విషయంపై పీఎల్ పిటిషన్‏పై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ పీడీ ఆదికేశవులు గురువారం నోటీసులు జారీ చేసింది. దీనిపై సెప్టెంబర్ 16 లోపు వివరణ ఇవ్వాలని సూచించింది. కాంట్రాక్ మహిళ ఉద్యోగులకు, రెగ్యులర్ మహిళ ఉద్యోగులకు ఒకే విధంగా ప్రసూతి సెలవులు మంజూరు చేయడానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం నుంచి తగిన అంశాలను తీసుకోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాదికి హైకోర్టు సూచించింది.

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళలకు కల్పించిన ప్రసూతి సెలవుల్లో తారతమ్యం ఉండకుండా.. తాత్కాలిక ఉద్యోగులకు కూడా ప్రసూతి సెలవులను వర్తింపజేయాలని రాష్ట్రప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో వివాహమైన మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న వేతనంతో కూడిన ప్రసూతి సెలవును 180 రోజుల నుంచి 270 రోజులుగా పెంచుతూ 2016లో జీవో జారీ అయింది. ఇక ఈ రాయితీ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు కూడా కల్పిస్తూ 2020లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ జీవో అమలుపరచడం లేదంటూ హైకోర్టు న్యాయవాది రాజగురు హైకోర్టులో ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్‌ బెనర్జీ, న్యాయమూర్తి కృపాకరన్‌తో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ప్రసూతి సెలవులు మంజూరు చేయడంలో ప్రభుత్వ మహిళా ఉద్యోగుల పట్ల పక్షపాతం చూపరాదని, అందర్నీ సమానంగా చూడాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది.

Also Read: Nani: హీరో నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్ ఓనర్స్ అసోసియేషన్.. అపాలజీ లెటర్ రిలీజ్.. కారణమిదే..

మెగాస్టార్ తనయ నిర్మాణంలో మరో మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‏లుక్.. ఇంతకీ సినిమా పేరెంటో తెలుసా…

Happy Birthday Bhumika : విశాలమైన కళ్ళు .. విచ్చుకున్న పూరేకులంటి పెదాలు.. ఆమె అందం వర్ణనాతీతం

RakshaBandhan 2021: ఈ రాఖీ పండుగకు మీ సోదరుడికి స్మార్ట్ బ్యాండ్‌తో ఆరోగ్య రక్ష..అందుబాటు ధరలో ఉన్న స్మార్ట్ బ్యాండ్‌లు ఇవే!