Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Govt.: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య, నెలకు రూ. 5 వేలు పింఛన్ః ఎంపీ సీఎం శివ‌రాజ్ సింగ్

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి.. ఎందరో చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

MP Govt.: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య, నెలకు రూ. 5 వేలు పింఛన్ః ఎంపీ సీఎం శివ‌రాజ్ సింగ్
Madhya Pradesh Government Announces Free Education
Follow us
Balaraju Goud

|

Updated on: May 13, 2021 | 12:04 PM

Madhya Pradesh Government Announces: ప్రజల్లో కరోనా మహమ్మారి వణుకు పుట్టిస్తోంది. వైరస్ సోకి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. సరియైన వైద్యం ఎందరినో బలి తీసుకుంటుంది. చిన్న పెద్దా తేడా లేకుండా అందరినీ అవహిస్తోంది. దీంతో ఎందరో చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. చిన్నారుల‌కు ప్రతి నెల ఆర్థిక సాయం అందించాల‌ని మ‌ధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. క‌రోనాతో త‌ల్లిదండ్రులు, సంర‌క్షకులను కోల్పోయిన పిల్లల‌కు ప్రతి నెల రూ.5 వేలు పెన్షన్ అందిస్తామ‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ప్రక‌టించారు. అదేవిధంగా వారికి ఉచితంగా విద్యను అందిస్తామ‌ని, వారి కుటుంబాల‌కు ఫ్రీగా రేష‌న్‌ను పంపిణీ చేస్తామ‌ని వెల్లడించారు.

మరోవైపు, ఇదే తరహా ప‌థ‌కాన్నే జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రక‌టించింది. క‌రోనాతో త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన చిన్నారుల‌కు ప్రత్యేక స్కాల‌ర్‌షిప్ అందిస్తామ‌ని క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్ మ‌నోజ్ సిన్హా తెలిపారు. దీంతో అనాథలుగా మారిన‌ పిల్లల‌కు మేలు జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 ,12 వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలకు ప్రత్యామ్నాయ మార్గాలను బోర్డు పరిశీలిస్తోందని, 10 వ తరగతి, 12 బోర్డు పరీక్షలను త్వరలో నిర్వహించడానికి సంబంధించి ఏదైనా నిర్ణయాన్ని ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు సిద్ధమని, ముఖ్యంగా పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నామని సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.

ఇదిలావుంటే, మ‌ధ్యప్రదేశ్‌లో కొత్తగా 8,970 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 7,00,202కు చేరాయి. ఇందులో 1,09,928 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 5,83,595 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. మ‌రో 6,679 మంది బాధితులు క‌రోనా బారినపడి ప్రాణాలను కోల్పోయారు. Read Also.. ఆగస్టు కల్లా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుతాం, సీరం, భారత్ బయో టెక్ కంపెనీల ప్రకటన, కేంద్రానికి ప్లాన్ సమర్పణ