అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడి ప్రాణం తీసిన సిలిండర్.. అసలు ఏం జరిగిందంటే?

రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. క్షణికావేశంలో రక్తసంబంధాన్ని మరిచి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు జనాలు. చిన్న చిన్న విషయాలకే చంపుకునే వరకు వెళ్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే లక్నోలో వెలుగుచూసింది. అన్నదమ్ముల మధ్య చిన్నగా మొదలైన గొడవ ఏకంగా ఒకరి ప్రాణాలు పోయే వరకు వెళ్లింది. ఇంతకూ ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.

అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడి ప్రాణం తీసిన సిలిండర్.. అసలు ఏం జరిగిందంటే?
Lucknow Crime News

Updated on: Jun 08, 2026 | 4:09 PM

ఇంట్లో చిన్నగా మొదలైన గొడవ కారణంగా ఓ వ్యక్తి తన అన్నను సిలిండర్‌తో కొట్టి చంపిన ఘటన లక్నోలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. జంకిపురం ప్రాంతానికి చెందిన ఆర్యన్ మిశ్రా, 24 ఏళ్ల అభిషేక్ మిశ్రా ఇద్దరు అన్నదమ్ములు. అయితే ఆదివారం ఏదో విషయంలో అన్నదమ్ములిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. మాట మాట పెరిగి.. ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లింది గొడవ.

ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన అభిషేక్.. ఇంట్లో ఉన్న సిలిండర్ తీసుకొని అన్న ఆర్యన్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆర్యన్ అక్కడికక్కడే పడిపోయాడు. ఇక ఇంట్లోని కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. కానీ హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతూ ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడు.

ఇక హాస్పిటల్ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  ఘటనపై కేసు నమోదు చేసి, ఘటనకు గల కారణాలపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఇక అప్పటికే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన అభిషేక్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us