Lok Sabha Polls 2024: ముందస్తుగా సార్వత్రిక ఎన్నికలు.. హస్తిన రాజకీయల్లో సరికొత్త టెన్షన్.. నిన్న మమతా, నేడు నితీష్, బాబు..

Lok Sabha Polls : 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. దీంతో అన్ని పార్టీల టార్గెట్ అదే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో ఇప్పటికే మంతనాలు జరిపింది. అయితే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా స్పీడును పెంచింది.

Lok Sabha Polls 2024: ముందస్తుగా సార్వత్రిక ఎన్నికలు.. హస్తిన రాజకీయల్లో సరికొత్త టెన్షన్.. నిన్న మమతా, నేడు నితీష్, బాబు..
National Politics

Updated on: Aug 29, 2023 | 8:30 PM

Lok Sabha Polls : 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. దీంతో అన్ని పార్టీల టార్గెట్ అదే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో ఇప్పటికే మంతనాలు జరిపింది. అయితే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా స్పీడును పెంచింది. ఇప్పటికే రెండు సార్లు భేటీ అయిన ఇండియా కూటమి నేతలు ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ముంబై వేదికగా జరగనున్న మూడో సమావేశంలో ఇండియా కూటమి కన్వీనర్, ప్రధాని అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. ఈ క్రమంలో హస్తిన రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సమావేశాలు ఏమో గానీ, ప్రస్తుతం ఈ టాపిక్ మొత్తం సార్వత్రిక ఎన్నికల తేదీల వైపు మళ్లింది. ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో పార్టీలన్నీ పోరుకు సమాయత్తమవుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి 2024 లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే అవకాశముంది. కానీ, ఈ ఎన్నికలు మరింత ముందు జరుగుతాయన్న ప్రచారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ మాటలు రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నాయి. తాజాగా, ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోట కూడా ముందస్తు ఎన్నికల మాటే వినిపించింది. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా మరింత చర్చకు దారితీస్తోంది.

ఎవరెవరు ఏమన్నారంటే..

‘‘ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా జనవరిలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. విపక్షాల ఐక్యత (ఇండియా కూటమి) కారణంగా బీజేపీ కాలక్రమేణా మరింత నష్టపోతుందనే భయంతో లోక్‌సభ ఎన్నికలను మరింత ముందుకు తెస్తున్నారు.’’ – మమతా బెనర్జీ

ఇదే వాదనకు మద్దతు ఇస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా లోక్‌సభ ఎన్నికలు ముందుగానే జరగవచ్చన్న అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

బెంగాల్ సీఎం మమతా ప్రకటన గురించి మీడియా అడిగిన ప్రశ్నకు నితీష్ కుమార్ సమాధానమిస్తూ.. ‘‘కేంద్రంలోని NDA ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లవచ్చని నేను గత ఏడు-ఎనిమిది నెలలుగా చెబుతున్నా.. ప్రతిపక్షాల ఐక్యత కారణంగా బిజెపికి మరింత నష్టం జరుగుతుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశముంది.. కావున లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలి.. ప్రధాని పదవి కోసం నాకు ఎలాంటి కోరిక లేదు.. వ్యక్తిగత ఆశయాలు కూడా లేవు.. దీన్ని మరోసారి చెబుతున్నా.. ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో ఎక్కువ సంఖ్యలో పార్టీలను ఏకం చేయాలన్నదే నా కోరిక’’ – నితీష్ కుమార్

విపక్షాల సంకీర్ణ కూటమి ఇండియాలో మరిన్ని పార్టీలు చేరే అవకాశం ఉందని ఇటీవల చెప్పిన నితీష్ కుమార్.. దానికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత కోసం చర్యలు చేపట్టామని, ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబై సమావేశం తర్వాత ప్రతిపక్షాల కూటమి ఇండియా మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కుల గణనపై కూడా మాట్లాడారు. కుల గణన వివిధ వర్గాల అభివృద్ధికి వీలు కల్పిస్తుందంటూ పేర్కొన్నారు. కులాల వారీగా సర్వే నిర్వహించాలన్న నిర్ణయాన్ని బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకగ్రీవంగా తీసుకున్నాయంటూ చెప్పారు. జనాభా లెక్కల జాప్యంపై కేంద్రం ఎందుకు మౌనం వహిస్తోంది? ఈ కసరత్తు 2021 లోనే పూర్తి కావాలి. దీని గురించి బీజేపీ నాయకులు స్పందించాలి అంటూ పేర్కొన్నారు.

చంద్రబాబు ఏమన్నారంటే..

ఇదిలాఉంటే.. ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఢిల్లీలో పొత్తులు సహా పలు విషయాలపై మాట్లాడిన చంద్రబాబు.. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందని తెలిపారు. పొత్తులకు తమ పార్టీ ఎప్పుడూ సానుకూలమేనని.. ఎన్నికల సమయంలో పొత్తు ఎవరితోనన్నది తెలుస్తుందన్నారు. కాగా.. ముందస్తు ఎన్నికల విషయాన్ని మాత్రం బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో సోమవారం మాట్లాడిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ముందస్తు ఎన్నికల విషయాన్ని ఖండించారు. ముందస్తు ఎన్నికలపై అధిష్టానం నుంచి ఎలాంటి సూచనలు లేవన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..