Nagpur Politics: నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారా.. దళిత-ఓబీసీ ఓట్లు ఎవరి ఖాతాలోకి వెళ్తాయి..?

|

Apr 03, 2024 | 1:00 PM

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. తొలి విడతలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మహారాష్ట్రంలోని నాగ్‌పూర్ లోక్‌సభ స్థానంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే, గడ్కరీ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది.

Nagpur Politics: నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారా.. దళిత-ఓబీసీ ఓట్లు ఎవరి ఖాతాలోకి వెళ్తాయి..?
Nitin Gadkari, Nana Patole
Follow us on

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. తొలి విడతలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మహారాష్ట్రంలోని నాగ్‌పూర్ లోక్‌సభ స్థానంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే, గడ్కరీ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. నితిన్ గడ్కరీ ఇక్కడ నుండి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. నానా పటోలే ఈ ప్రాంతంలో బలమైన పట్టు ఉన్న నేత. ఒకవైపు నాగ్‌పూర్‌ బీజేపీకి కంచుకోటగా పరిగణిస్తారు. ఇక్కడ బీజేపీ సైద్ధాంతిక మార్గదర్శక సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. అయితే నానా పటోలేపై గెలవడం గడ్కరీకి అంత సులువు కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

2014, 2019లో గడ్కరీ ఇక్కడ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈసారి కూడా ఆయనదే పైచేయి అని భావిస్తున్నారు. ఈ సీటు మొదట్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. కానీ తర్వాత క్రమక్రమంగా బీజేపీ పట్టు సారించింది. 1996లో తొలిసారి ఇక్కడ బీజేపీ గెలుపొందగా, 1998 నుంచి 2004 వరకు కాంగ్రెస్‌కు చెందిన విలాస్ ముత్తేవార్ వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో బీజేపీ ఈ స్థానం నుంచి నితిన్ గడ్కరీని అభ్యర్థిగా చేసింది. అప్పటి నుంచి ఈ సీటు బీజేపీ ఖాతాలోనే ఉంది.

కుల సమీకరణాలు ఏమిటి?

నాగ్‌పూర్‌లో దళిత, ఓబీసీ ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్, నాగ్‌పూర్ సౌత్, నాగ్‌పూర్ ఈస్ట్, నాగ్‌పూర్ సెంట్రల్, నాగ్‌పూర్ వెస్ట్, నాగ్‌పూర్ నార్త్. 21 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న నాగ్‌పూర్ స్థానానికి ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. ఇక్కడ 50 శాతం ఓబీసీ ఓటర్లు, 20 శాతం దళిత ఓటర్లు, ముస్లిం ఓటర్లు 12 శాతం ఉన్నారు.

2019లో ఓడిపోయిన నానా పటోలే

2019లో కూడా కాంగ్రెస్ ఈ స్థానం నుంచి నానా పటోలేకు టికెట్ ఇచ్చింది. గడ్కరీ చేతిలో పటోలే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి విలాస్ ముత్తెంవార్‌పై గడ్కరీ 2,84,828 ఓట్లతో విజయం సాధించారు. గడ్కరీకి 5,87,767 ఓట్లు వచ్చాయి. 1951లో ఏర్పడ ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు చెందిన అనసూయాబాయి కాలే ఇక్కడ నుండి మొదటి ఎంపీ అయ్యారు. 1962లో స్వతంత్ర అభ్యర్థి మాధవ్‌ శ్రీహరి అనే వ్యక్తి గెలిచినా ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లింది. ప్రత్యేక విదర్భ డిమాండ్ కాంగ్రెస్‌ను బలహీనపరిచింది. కానీ వాస్తవానికి గడ్కరీ రాక తర్వాత సమీకరణాలు మారిపోయాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..